- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తుంబాద్ ప్రపంచంలోకి అలియా!.. మూడో భాగం కోసం ఇప్పటి నుంచే ప్లాన్
భారతీయ చలనచిత్ర చరిత్రలో హారర్ థ్రిల్లర్ జోనర్‌కి కొత్త అర్థం చెప్పిన చిత్రం ‘తుంబాద్’.

దిశ, సినిమా: భారతీయ చలనచిత్ర చరిత్రలో హారర్ థ్రిల్లర్ జోనర్‌కి కొత్త అర్థం చెప్పిన చిత్రం ‘తుంబాద్’. 2018లో రిలీజైన ఈ మూవీ విజువల్ వండర్‌తో పాటు కల్ట్ క్లాసిక్ హోదాని సొంతం చేసుకుంది. సోహమ్ షా ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ అప్పట్లో ప్రేక్షకులను సరికొత్త భయానక లోకంలోకి తీసుకెళ్లింది. దీంతో ఈ సినిమా సీక్వెల్ కోసం సినీ లవర్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే.. దీనికి సీక్వెల్‌గా వస్తున్న ‘తుంబాద్ 2’ ఈ ఏడాది డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు కూడా ఇప్పటికే అప్డేట్ ఇచ్చేశారు మేకర్స్. పెన్ మూవీస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా మరో సూపర్ అప్డేట్ వచ్చింది. ఈ మేరకు ఈ సీక్వెల్‌లో అలియా భట్ భాగం కాబోతున్నట్లు ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. మూడవ భాగానికి నాంది పలికే ఒక చిన్నదైనా ప్రభావవంతమైన పాత్రలో ఆమె కనిపించనుందట. ఆమె పాత్రకు సంబంధించిన చిత్రీకరణ కోసం మూడు వారాల షెడ్యూల్ రూపొందించబడినట్లు తెలుస్తుండగా.. దీనిపై అఫీషియల్ అప్డేట్ రావాల్సి ఉంది.






