- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అడల్ట్ మూవీలో స్టార్ హీరోయిన్.. 18 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ (Alia Bhatt).. త్వరలో మరోసారి ఓటీటీ (OTT) మూవీతో సందడి చేసేందుకు సిద్ధం అవుతోంది.

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ (Alia Bhatt).. త్వరలో మరోసారి ఓటీటీ (OTT) మూవీతో సందడి చేసేందుకు సిద్ధం అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ (Amazon Prime Videos) నిర్మించబోతున్న ఈ ఓటీటీ సినిమా 18ఏళ్లు పైబడిన వాళ్లు మాత్రమే చూసే కంటెంట్‌తో రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ అడల్ట్ మూవీతో ‘యే జవానీ హై దీవానీ’, ‘బ్రహ్మాస్త్ర’ వంటి చిత్రాలకు సహాయకురాలిగా వర్క్ చేసిన అయాన్ ముఖర్జీ బంధువు శ్రీతి ముఖర్జీ దర్శకురాలిగా పరిశ్రమకు పరిచయం కాబోతుంది. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే.. రణబీర్ కపూర్ నటించిన క్లాసిక్ హిట్ అందుకున్న చిత్రాల్లో ‘వేక్ అప్ సిద్’ ఒకటి.
ఈ సినిమాను అమ్మాయిల కోణంలో కొంచెం బోల్డ్‌గా చేస్తే ఉంటుందనే ఆలోచన అలియాకు రాగా.. బ్రహ్మాస్త్ర షూటింగ్ టైమ్‌లో శ్రీతి ముఖర్జీతో పంచుకుందట. దీంతో ఎగ్జైట్ అయిన శ్రీతి ఆ స్టోరీని డవలప్ చెయ్యగా.. ఇప్పుడు అది సినిమాను సిద్ధం అయ్యారట. ఈ ఓటీటీ మూవీ కాలేజీ వాతావరణంలో.. కొత్త నటీనటులతో చాలా ఫ్రెష్‌గా తీయబోతున్నారట. అంతే కాకుండా అక్టోబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ చెయ్యనున్నట్లు తెలుస్తుండగా.. దీనిపై త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు బాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. లింక్






