- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Alekhya Harika: ముద్దుగుమ్మ ఆ రంగు డ్రెస్ వేసిందంటే కుర్రాళ్లు ఫిదా కావాల్సిందే
బ్లాక్ డ్రెస్సుల్లో మెరిసిపోతున్న అలేఖ్య హారిక.

దిశ, వెబ్ డెస్క్: యూట్యూబ్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న యంగ్ బ్యూటీలలో అలేఖ్య హారిక ఒకరు. ఈమె చాలా కాలం పాటు యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్‌లో నటించి ఎంతోమంది ప్రేక్షకులను అలరించింది.
ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలోకి ఎంట్రీ ఇచ్చి బుల్లితెర అభిమానుల మనసు దోచుకుంది. ప్రస్తుతం ఈమె కొన్ని సినిమాల్లో నటిస్తూ కెరీర్‌ను మంచి దశలోనే ముందుకు సాగిస్తోంది.
ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన అనేక విషయాలను తన అభిమానులతో పంచుకుంటుంది. అలాగే హాట్ లుక్‌లో ఉన్న తన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ వస్తోంది.
అలేఖ్య ఎక్కువ శాతం బ్లాక్ కలర్‌లో ఉన్న డ్రెస్సులు ధరించి వాటికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేస్తూ వస్తోంది. ఇప్పటివరకు హారిక అనేకసార్లు నలుపు రంగు దుస్తుల్లో తన అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
ఈమె నలుపు రంగు దుస్తులు ధరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అనేక ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా బ్లాక్ అవుట్‌ఫిట్‌లో ఈ నటి ఎన్నోసార్లు తళుక్కున మెరిసి తన స్టైలిష్ లుక్స్‌తో యువత గుండెలను కొల్లగొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
Photos Courtesy: Instagram






