- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
83 ఏళ్ల వయస్సులో తండ్రి అయిన స్టార్ నటుడు.. కంగ్రాట్స్ చెప్తున్న నెటిజన్లు..
మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటే ఏమో అనుకున్నాం కానీ పైసలు ఉంటే లేట్ వయసులోనూ తండ్రి కావచ్చని ఈ మధ్యే తెలిసింది. అవును.. హాలీవుడ్ స్టార్ ఆల్ పసినో తీరు చూస్తే ఇలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఈయన ఏకంగా 83 ఏళ్ల వయస్సులో

దిశ, వెబ్ డెస్క్: మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటే ఏమో అనుకున్నాం కానీ పైసలు ఉంటే లేట్ వయసులోనూ తండ్రి కావచ్చని ఈ మధ్యే తెలిసింది. అవును.. హాలీవుడ్ స్టార్ ఆల్ పసినో తీరు చూస్తే ఇలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఈయన ఏకంగా 83 ఏళ్ల వయస్సులో తండ్రి అయ్యాడు. ఇప్పటికే ముగ్గురు పిల్లలున్నా సరే.. తాతగా మనవళ్లు, మనవరాళ్లను ఆడించాల్సిన వయసులో తండ్రి కావాలన్న ముచ్చట తీర్చుకున్నాడు. తన గర్ల్ ఫ్రెండ్ నూర్ అల్ఫల్లాతో కలిసి నాల్గవ సంతానానికి జన్మనిచ్చాడు. కుమారుడు రోమన్‌కు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పి వార్తల్లో నిలిచాడు. ఇక అతని వయస్సు 83 కాగా.. గర్ల్ ఫ్రెండ్ అల్ఫల్లాకు 29ఏళ్లు మాత్రమే. అంటే 54 సంవత్సరాల వయస్సు తేడా. దీంతో ఈ వార్త పెద్ద చర్చకు దారతీసింది. అభిమానులు కంగ్రాట్స్ చెప్పగా.. కొందరు మాత్రం విమర్శించారు.
ఇక ఆల్ పసినో.. జాన్ టారంట్‌తో జూలీ (35 సంవత్సరాలు), బెవర్లీ డి’అంజెలోతో కవలలు ఆంటన్, ఒలివియా (24 సంవత్సరాలు)కు జన్మనిచ్చాడు. కానీ నాల్గోసారి తండ్రి కావడాన్ని చాలా ప్రత్యేకమైనదిగా చెప్పాడు. అయితే కొడుకు పుట్టాక విడిపోయిన అల్ఫల్లాతో కస్టడీ వివాదం ఉందనే రూమర్స్ కూడా వచ్చాయి. కానీ తాము సహకార సంబంధాన్ని కొనసాగిస్తున్నామని క్లోజ్‌గా కనిపించి గాసిప్స్‌కు చెక్ పెట్టారు. కాగా లేట్ వయసులో తండ్రి కావాలనే ఆలోచన హాలీవుడ్ ఐకాన్‌లలో కొనసాగుతూనే ఉంది. రాబర్ట్ డి నీరో 79 ఏళ్ల వయస్సులో తన ఏడవ సంతానాన్ని స్వాగతించారు.






