- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘జై హనుమాన్’లో అక్షయ్ ఖన్నా?
‘జై హనుమాన్’లో అక్షయ్ ఖన్నా కీలక పాత్ర పోషించబోతున్నట్లు టాక్ నడుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: ధురంధర్ సినిమాతో జనాల్లోకి చొచ్చుకుపోయిన అక్షయ్ ఖన్నాకు సౌత్ ఇండియాలో విపరీతమైన అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే అతనికి తెలుగులో చాలా సినిమాలలో అవకాశాలు రాగా.. లేటెస్ట్ గా మరో బంపర్ ఆఫర్ తగిలినట్లు టాక్ నడుస్తోంది. ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్న జై హనుమాన్ సినిమాలో అక్షయ్ ఖన్నా నటించనున్నట్లు సమాచారం. ఈ మేరకు చిత్ర బృందంతో సంప్రదింపులు కూడా పూర్తయ్యాయట.
త్వరలో అతడి పాత్ర ఏది అనేది ? మేకర్స్ ప్రకటించనున్నారని టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ వార్త వైరల్ అవుతోంది. ఇప్పటికే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ మహాకాళిలో శుక్రాచార్యుడి పాత్రను అక్షయ్ ఖన్నా పోషిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇక ఇప్పుడు జై హనుమాన్ సినిమాలో కూడా ఓ స్పెషల్ రోల్ ఇవ్వనున్నారట. ఇది ఇలా ఉండగా జై హనుమాన్ సినిమాలో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి లీడ్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్, జనాలను ఆకట్టుకుంటున్నాయి. సినిమాపై అంచనాలను కూడా పెంచాయి.






