హారర్ కామెడీ సినిమాతో రాబోతున్న అక్షయ్ కుమార్.. ‘భూత్ బంగ్లా’ అప్డేట్ ఇస్తూ మేకర్స్ ట్వీట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-07 13:47:15  IST  )

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar) వరుస సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్‌లోఉన్నారు.

హారర్ కామెడీ సినిమాతో రాబోతున్న అక్షయ్ కుమార్.. ‘భూత్ బంగ్లా’ అప్డేట్ ఇస్తూ మేకర్స్ ట్వీట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar) వరుస సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్‌లోఉన్నారు. హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వచ్చిన అవకాశాలన్నింటి ఒప్పుకుంటున్నాడు. గత ఏడాది ఏకంగా అక్షయ్ కుమార్ ఓ ఐదు సినిమాల్లో నటించారు. అయితే ఇందులో ‘స్త్రీ-2’ ఘన విజయం సాధించింది. ఇక ఇటీవల ఆయన ‘కేసరి చాప్టర్-2’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం ఏప్రిల్ 18న థియేటర్స్‌లోకి వచ్చి హిట్‌గా నిలిచింది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబడుతూ దూసుకుపోతుంది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ మంచు విష్ణు ‘కన్నప్ప’(Kannappa) మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, అక్షయ్ కుమార్ ఓ హారర్ కామెడీ చిత్రంతో రాబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలైంది. ప్రియదర్శన్(Priyadarshan) దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీలో టబు, పరేష్ రావల్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన షూట్‌లో మే 15 నుంచి అక్షయ్ జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ‘భూత్ బంగ్లా’ వచ్చే ఏడాది థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు మేకర్లు వెల్లడించారు. అంతేకాకుండా అక్షయ్ నల్లపిల్లిని భుజాలపై ఎంకించుకుని నాలుకతో గిన్నెలోని పాలను నాకుతూ కనిపించాడు.

Click For Tweet..

Next Story