17 ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే స్క్రీన్‌పై కనిపించబోతున్న స్టార్ హీరోలు.. యుద్ధం మొదలయ్యేది ఎప్పుడంటే?

by Mallepaka Hamsa |

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar) వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

17 ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే స్క్రీన్‌పై కనిపించబోతున్న స్టార్ హీరోలు.. యుద్ధం మొదలయ్యేది ఎప్పుడంటే?
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar) వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇటీవల ఆయన ‘కేసరి చాప్టర్-2’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ‘కన్నప్ప’ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో.. తాజాగా, అక్షయ్ కుమార్ ఓ ఆఫర్ అందుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ సూపర్ స్టార్స్ అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan) 17 సంవత్సరాల తర్వాత కలిసి నటిస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

2016 మలయాళ థ్రిల్లర్ ‘ఒప్పం’ (Oppam)సినిమాను రీమేక్‌ చేయనున్నట్లు సమాచారం. దీనికి ప్రియదర్శన్ (Priyadarshan)దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇందులో సైఫ్ హీరోగా నటిస్తుండగా.. అక్షయ్ విలన్‌గా కనిపించబోతున్నట్లు టాక్. వీరిద్దరి మధ్య యుద్ధం జరగబోతున్నట్లు తెలుస్తోంది. మోహన్‌లాల్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ ‘ఒప్పం’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 2025లో నిర్మాణం ప్రారంభించనుంది . ఇక 2026లో థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story