Akshay Kumar: నటుడికి లీగల్ నోటీసులు పంపిన అక్షయ్ కుమార్.. దుమారం రేపుతున్న ట్వీట్!

by Mallepaka Hamsa |

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar), నటుడు పరేష్ రావల్‌(Paresh Rawal)కు లీగల్ నోటీసులు పంపినట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి.

Akshay Kumar: నటుడికి లీగల్ నోటీసులు పంపిన అక్షయ్ కుమార్.. దుమారం రేపుతున్న ట్వీట్!
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar), నటుడు పరేష్ రావల్‌(Paresh Rawal)కు లీగల్ నోటీసులు పంపినట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. నష్ట పరిహారంగా రూ. 25 కోట్లు కట్టాలంటూ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అసలు విషయంలోకి వెళితే.. అక్షయ్ కుమార్ నటించిన కామెడీ సినిమా ‘హెరా ఫేరీ’ ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిందనడంలో అతిశయోక్తి లేదు. సునీల్ శెట్టి, పరేష్ రావల్ కీలక పాత్రలో నటించిన ఈ మూవీ 2000సంవత్సరంలో వచ్చి ప్రేక్షకులను అలరించడంతో పాటు బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది.

దీంతో మూవీ మేకర్స్ దీనికి సీక్వెల్‌గా ‘ఫిర్ హెరా ఫేరీ’(Phir Hera Pheri)ని 2006లో తీసుకువచ్చారు. మళ్లీ 19 ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘హెరా ఫేరీ-3’ రాబోతుంది. ఇందుకు సంబంధించిన స్కిప్ట్ వర్క్ కూడా పూర్తయిందని సమాచారం. ఈక్రమంలోనే పరేష్ రావల్‌కు, చిత్రయూనిట్‌కు ఏదొ గొడవ జరగ్గా.. ఆయన సినిమా నుంచి తప్పుకున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. ఇక ఈ విషయం మూవీ టీమ్‌కు చెప్పకుండా ప్రకటించడంతో అక్షయ్, సునీల్ శెట్టి షాక్ అయ్యారు. ఇక పరేష్ రావల్ తప్పుకున్న కారణంగా నిర్మాణ సంస్థ ఆయనపై సీరియస్ యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది..

ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న అక్షయ్ కుమార్, పరేష్ రావల్ చెప్పకుండా తప్పించుకున్నందుకు రూ. 25 కోట్ల నష్టపరిహారం కట్టాలని లీగల్ నోటీసులు పంపినట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈక్రమంలో.. తాజాగా, పరేష్ రావల్ ట్విట్టర్ ద్వారా ఈ వివాదంపై స్పందించి క్లారిటీ ఇచ్చాడు. ‘‘నాకు హెరా ఫేరీ మూవీ టీమ్‌‌కు ఎలాంటి విభేదాలు జరగలేదు. నేను ఈ విషయాన్ని అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. చిత్రనిర్మాతతో ఎటువంటి సృజనాత్మక విభేదాలు లేవని నేను పునరుద్ఘాటిస్తున్నాను. చిత్ర దర్శకుడు శ్రీ ప్రియదర్శన్ పట్ల నాకు అపారమైన ప్రేమ, గౌరవం నమ్మకం ఉన్నాయి’’ అని పెట్టడంతో ఈ పుకార్లకు చెక్ పడినట్లు అయింది.





Next Story