- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
19 ఏళ్ల తర్వాత ఆ సినిమాకు సీక్వెల్.. ఈసారి మూడు జంటలతో రచ్చ రచ్చ!
దాదాపు 19 ఏళ్ల తర్వాత ‘సలామ్-ఎ-ఇష్క్’ కు సీక్వెల్ రాబోతుండగా అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.

దిశ, సినిమా: మల్టీస్టారర్‌గా వచ్చి హిట్ అందుకున్న చిత్రాల్లో ‘సలామ్-ఎ-ఇష్క్’ ఒకటి. 2007లో వచ్చిన ఈ కల్ట్ రొమాంటిక డ్రామాకు 19 ఏళ్ల తర్వాత దర్శకుడు నిఖిల్ అద్వానీ ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రంలోని ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న మూడు ప్రేమకథలలో రూపొందబోతుండగా.. అక్షయ్‌కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సీక్వెల్ మూడు విభిన్న జంటల ద్వారా ఆధునిక సంబంధాలు, ఎమోషన్స్, కామెడీ అన్నీ రూపాలలోనూ రాబోతుంది. ఇక, శంకర్ మహదేవన్, ఎహసాన్ నూరానీ, లాయ్ మెండోన్సాల ఐకానిక్ త్రయం సంగీతాన్ని అందించనున్నారు. అంతేకాకుండా, 'చాందినీ చౌక్ టు చైనా' అండ్ 'పటియాలా హౌస్' వంటి చిత్రాల తర్వాత నిఖిల్ అద్వానీ, అక్షయ్ కుమార్ మళ్లీ కలిసి పనిచేయనుండగా బాలీవుడ్‌లో ఈ చిత్రంపై హై ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఇక త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ ఇవ్వనున్నారు మేకర్స్.






