- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Akshara Gowda: సముద్ర తీరంలో టూ-పీస్ డ్రెస్‌తో హీట్ పెంచిన హాట్ బ్యూటీ
బ్లాక్ టూ-పీస్‌లో సముద్ర తీరంలో హాట్ షో చేసిన అక్షర గౌడ

దిశ, వెబ్ డెస్క్: గ్లామర్‌తో పాటు నటనతో గుర్తింపు తెచ్చుకున్న వారిలో అక్షర గౌడ ఒకరు. ఈమె తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఈ బ్యూటీ బెంగళూరులో జన్మించింది.
ఈమె అసలు పేరు హరిని గౌడ. మోడలింగ్ రంగంలో మంచి గుర్తింపును సంపాదించుకున్న తర్వాత సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. 2011లో విడుదలైన "ఉయర్తిరు 420" అనే తమిళ చిత్రం ద్వారా ఈ నటి వెండితెరకు పరిచయం అయింది. అనంతరం పలు భాషల్లో సినిమాలు చేస్తూ తన కెరీర్‌ను కొనసాగించింది.
తెలుగులో "మన్మధుడు 2", "ది వారియర్" చిత్రాల్లో నటించింది. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించకపోవడంతో ఈ బ్యూటీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ స్థాయిలో గుర్తింపు దక్కలేదని చెప్పవచ్చు.
కాసేపు ఈ నటి సినిమాల విషయాన్ని పక్కన పెడితే, ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ వస్తోంది. దీంతో అక్షరకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది.
తాజాగా ఈమె కొన్ని గ్లామరస్ లుక్‌లో ఉన్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అందులో ఈ బ్యూటీ బ్లాక్ కలర్‌లో ఉన్న టూ-పీస్ డ్రెస్ ధరించి సముద్రపు అలల మధ్య తన అందాలను ప్రదర్శిస్తూ ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ పిక్స్‌లో ఈమె ఎంతో స్టైలిష్ మరియు గ్లామరస్ లుక్‌లో కనిపించడంతో, ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్‌గా మారాయి.
Photos Courtesy: Instagram






