పెళ్లైన ఇన్ని రోజులకు గుడ్ న్యూస్ చెప్పిన అక్కినేని కోడలు.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు(ట్వీట్)

by Gugulothu.Kavitha |   (  Updated:2026-02-12 10:27:58  IST  )

పెళ్లి తరవాత శోభిత దూళిపాళ గుడ్ న్యూస్ వినిపించింది. నాగచైతన్యతో కొత్త సినిమా చేయబోతున్నట్లు తెలిపింది.

పెళ్లైన ఇన్ని రోజులకు గుడ్ న్యూస్ చెప్పిన అక్కినేని కోడలు.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు(ట్వీట్)
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ చిన్నది తెలుగు అమ్మాయే అయినప్పటికీ బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా రాణించింది. అలాగే తెలుగులోకూడా మంచి మంచి సినిమాలు చేసి హీరోయిన్‌‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఇక అక్కినేని హీరో నాగ చైతన్యతో ప్రేమలో పడి మ్యారేజ్ కూడా చేసుకుంది. అయితే మ్యారేజ్ అయినప్పటి నుంచి కొత్త సినిమా అనౌన్స్ చేయలేదు. ఈ క్రమంలో పెళ్లైనా వన్ ఇయర్‌కు గుడ్ న్యూస్ చెప్పింది.

నాగచైతన్యతో పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ కొత్త సినిమా చేయబోతున్నట్లు తెలిపింది. ఇక ఈ సినిమాకు ‘చీకటిలో’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే ఈ మూవీ డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో జనవరి 23 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు శోభిత ధూళిపాళ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక పోస్టర్‌లో.. శోభిత రేడియో జాకీ లా కనిపిస్తుంది. ఆమె వెనకాల ఇన్వెస్టిగేషన్‌కి సంబంధించిన సెటప్ ఉంది. దీంతో చీకటిలో సినిమా థ్రిల్లర్ జానర్ అని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story