Sobhita Dhulipala : సంక్రాంతి వేళ అక్కినేని కోడలు శోభితపై ట్రోలింగ్.. నీ ఇష్టమైన సంప్రదాయం ఇదేనా..?

by Vennela |   (  Updated:2026-02-12 12:02:42  IST  )

అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ పెళ్లి తర్వాత జరుపుకుంటున్న మొదటి సంక్రాంతి సెలబ్రేషన్స్ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. నాగచైతన్యతో కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. దీంతో కొందరు ట్రోల్ చేస్తున్నారు.

Sobhita Dhulipala : సంక్రాంతి వేళ అక్కినేని కోడలు శోభితపై ట్రోలింగ్..  నీ ఇష్టమైన సంప్రదాయం ఇదేనా..?
X

Sobhita Dhulipala : అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), శోభితా ధూళిపాళ(Sobhita Dhulipala) ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ 4వ తేదీన వీరిద్దరి వివాహం సాంప్రదాయ పద్దతిలో ఘనంగా జరిగింది. ఈ పెళ్లిలో శోభిత కూడా పద్దతిగా రెడీ అయి అందర్నీఆశ్చర్యపరిచింది. సాంప్రదాయంగా ఉండటం తనకు ఇష్టమని పలుమార్లు చెప్పిన శోభిత.. దానికి తగ్గట్లుగానే పసుపులు ముట్టినప్పటి పెళ్లి జరిగేంత వరకు ప్రతి సందర్భంలోనూ కట్టు, బొట్టుతో శోభితా ఆకట్టుకుంది.

అయితే వివాహం తర్వాత వచ్చిన మొదటి పండగ సంక్రాంతి కావడం(Naga Chaitanya Sankaranthi Celebrations)తో ఈ జంట ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. మేము ఇలా సంక్రాంతి జరుపుకున్నాం అంటూ ఫొటోలను ఇన్ స్టాలో స్టోరీలు పోస్టు చేసింది శోభితా . ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే నెటిజన్లు మాత్రం ఈ ఫొటోలపై భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు విమర్శలు చేస్తే.. మరికొందరు మాత్రం సమర్థిస్తున్నారు. ఇదేనా సాంప్రదాయం అంటూ కొంతమంది నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.

అసలేం జరిగిందంటే.. సంక్రాంతి సెలబ్రేషన్స్(Naga Chaitanya Sankaranthi Celebrations) లో భాగంగా శోభిత భోగిమంటలు, పరమాన్నంతోపాటు ..ఎరుపు రంగు చీరలో అద్దం ముందు నిల్చుండి తీసుకున్న సెల్ఫీలను స్టోరీగా పోస్టు చేసింది. నాగ చైతన్యతో కలిసి పాదాలు కనిపించేలా ఉన్న ఫొటోను సైతం స్టోరీలో లవ్ సింబల్ తో హైలైట్ చేసింది. సంక్రాంతి సెలబ్రేషన్స్ కోసం శోభిత, చైతూ ఇద్దరు పట్టు వస్త్రాలు ధరించారు.

శోభిత రెడ్ కలర్ చీరకు గోల్డెన్ అంచుతో ఉన్న శారీ కట్టుకుని అందంగా ముస్తాబైంది. ఇక్కడే దొరికిపోయింది శోభిత. పెళ్లి జరిగి ఇంకా రెండు నెలలు కూడా కాలేదు అప్పుడే కాళ్లకు మెట్టెలను తీసేసి కనిపించింది. దీంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. నాగచైతన్య పెళ్లిలో కాళ్లకు మెట్టెలు పెట్టేటప్పుడు ఎంతో ఎమోషనల్ గా ఫీల్ అయ్యావు. ఇప్పుడు అవి తీసేసావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిశ్చితార్థం నుంచి సాంప్రదాయంగా ఉన్నావు.. కానీ మరి ఇప్పుడు ఆ సాంప్రదాయం ఏమైంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాలికి మెట్టెలు తీయకూడదనే విషయం తెలియదా అని ప్రశ్నిస్తున్నారు.

రోజు పెట్టుకోకున్నా..కనీసం పండగపూట పెట్టుకోవచ్చు కదా? అంటూ ఏకీపారేస్తున్నారు. మరికొందరు మాత్రం శోభితకు సపోర్టు చేస్తున్నారు. వారికి లేని బాధ మీకేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

Next Story