- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sobhitha Dhulipala: అస్సలు ఊహించలేదంటూ హార్ట్ బ్రేకింగ్ పోస్ట్ పెట్టిన అక్కినేని కోడలు.. అసలేం జరిగిందంటే?
జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో పర్యాటకులపై జరిగిన భీకర ఉగ్రదాడిలో ఏకంగా 28 మంది ప్రాణాలు కోల్పోయారు.

దిశ, సినిమా: జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో పర్యాటకులపై జరిగిన భీకర ఉగ్రదాడిలో ఏకంగా 28 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే పహల్గాంలో మంగళవారం పలు ప్రదేశాలను చూడటానికి వెళ్లి పర్యాటకులపై ఉగ్రవాదులు ఒక్కసారిగా చేయడంతో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ సంఘటన సాధారణ జనాలతో పాటు సినీ సెలబ్రిటీలకు కూడా కలిచివేస్తోంది. దీంతో తమ బాధను సోషల్ మీడియా ద్వారా వారు తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది సినీ స్టార్స్ స్పందించగా.. తాజాగా, అక్కినేని కోడలు శోభిత దూళిపాళ(Sobhitha Dhulipala) ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఎమోషనల్ పోస్ట్ట పెట్టింది. ‘‘పహల్గామ్‌లో జరిగిన సంఘటన భయాందోళనకు గురిచేసింది. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారి బాధను ఊహించలేము. మరణించిన వారి శాంతి కోసం ప్రార్థిస్తూ ఈ క్రూరత్వాన్ని, అన్యాయాన్ని విలైనంత త్వరగా పరిష్కరించాలని నేను ఆశిస్తున్నాను’’ అని రాసుకొచ్చింది.
అలాగే హార్ట్ బ్రేకింగ్, దండం పెడుతున్న ఎమోజీలు షేర్ చేసింది. ప్రస్తుతం ఆమె సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ విషయంపై టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా రియాక్ట్ అయ్యారు. ట్విట్టర్ ద్వారా ఓ పోస్ట్ పెట్టారు. ‘‘నేను రెండేళ్ల క్రితం నా పుట్టినరోజును పహల్గాంలో సెలబ్రేట్ చేసుకున్నాను. ఓ సినిమా షూటింగ్ కారణంగా అక్కడికి వెళ్లాను. అయితే కశ్మీర్‌లో అందమైన ప్రాంతంలో అక్కడి ప్రజల స్వచ్ఛమైన నవ్వుల మధ్య నా బర్త్ డే చేసుకున్నాను. స్థానికంగా ఉండే స్నేహితులు నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు.
నిన్న అదే ప్రాంతంలో జరిగినది విని నా హృదయం పగిలిపోయింది. ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో వచ్చి కాల్పులు జరపడం సిగ్గుచేటు. ఇలాంటి పిరికి వాళ్లను త్వరలోనే అందమొందిస్తామని ఆశిస్తున్నా. భారతదేశం ఉగ్రవాదానికి తలవంచదు. బాధిత కుటంబాలకు అండగా ఉంటా’’ అని రాసుకొచ్చారు. కాగా, శోభిత ఇటీవల అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక పెళ్లికి ముందు ఎన్నో బోల్డ్ చిత్రాల్లో నటించిన ఆమె కొద్ది రోజుల నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టి్వ్‌గా ఉంటూ పలు విషయాలపై రియాక్ట్ అవుతూ వార్తల్లో నిలుస్తోంది.
I celebrated my birthday 2 years ago in Pahalgam, amidst shooting a film, amidst laughter, amidst my local Kashmiri friends who took the greatest care of us..
— Vijay Deverakonda (@TheDeverakonda) April 23, 2025
What happened yesterday is heartbreaking and infuriating - calling yourself a Force and shooting tourists is the most…






