- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ సినిమా ట్రైలర్‌పై స్పందించిన అక్కినేని హీరో.. హార్ట్ టచింగ్ అంటూ ట్వీట్!
తాజాగా నాగ చైతన్య శ్రీ చిదంబరం గారు సినిమా ట్రైలర్‌పై స్పందించాడు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు. ‘శ్రీ చిదంబరం గారు ట్రైలర్.. నిజమైన, భావోద్వేగ, హృదయాన్ని హత్తుకునే.. వెచ్చని కౌగిలింతలా అనిపిస్తుంది.. ఆల్ ది బెస్ట్ టీమ్’ అని రాసుకొచ్చాడు.

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘జోష్’(Josh) సినిమాతో సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమై ఫస్ట్ మూవీతో ఓకే ఓకే అనిపించుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ‘ఏమాయ చేశావే’(Ye Maya Chesave) సినిమాతో భారీ హిట్ సాధించాడు. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా కొన్ని హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు. అయితే చివరిగా నటించిన ‘తండేల్’(Thandel) మూవీ తన లైఫ్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలించింది. చందూ మొండేటి(Chandu Mondeti) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) హీరోయిన్‌గా నటించింది. అలాగే అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీవాసు నిర్మించారు.
ప్రజెంట్ నాగచైతన్య కథానాయకుడిగా కార్తీక్ దండు(Karthik Dandu) దర్శకత్వంలో ‘ఎన్సీ-24’(NC-24) వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్న ఈ సినిమాలో లక్కీ హీరోయిన్ మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక అతని పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. సమంత(Samantha)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ హీరో తర్వాత విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(Shobitha Dhulipala)తో డేటింగ్ చేస్తూ ఆమెను 2024 డిసెంబర్‌లో మ్యారేజ్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ జంట మ్యారీడ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. మరోపక్క సినిమాలతో బిజీగా ఉన్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా నాగ చైతన్య ఓ సినిమా ట్రైలర్‌పై స్పందించాడు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు. ‘శ్రీ చిదంబరం గారు ట్రైలర్.. నిజమైన, భావోద్వేగ, హృదయాన్ని హత్తుకునే.. వెచ్చని కౌగిలింతలా అనిపిస్తుంది.. ఆల్ ది బెస్ట్ టీమ్’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా వంశీ తుమ్మల(Vamsi Thummala), సంధ్యా వశిష్ట హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా ‘శ్రీ చిదంబరం గారు’(Sri Chidambaram Garu). చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. అయితే ఈ మూవీ ఫిబ్రవరి 6న రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఆ మూవీ ట్రైలర్ చూసి నాగ చైతన్య స్పందించడం విశేషం.






