సిక్స్ ప్యాక్‌ బాడీతో దర్శనమిచ్చిన అక్కినేని హీరో.. అయ్యా అయ్యా అతని టాలెంట్‌ను ఇప్పటికైనా కరెక్టుగా వాడుకోండయ్యా అంటూ కామెంట్స్

by I. Sairam |   (  Updated:2025-04-19 11:33:00  IST  )

అక్కినేని హీరో అఖిల్(Akhil) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘సిసింద్రీ’(Sisindri) మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.

సిక్స్ ప్యాక్‌ బాడీతో దర్శనమిచ్చిన అక్కినేని హీరో.. అయ్యా అయ్యా అతని టాలెంట్‌ను ఇప్పటికైనా కరెక్టుగా వాడుకోండయ్యా అంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని హీరో అఖిల్(Akhil) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘సిసింద్రీ’(Sisindri) మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత హీరోగా ‘హలో’(Hello) మూవీతో పరిచయమయి.. కొన్ని చిత్రాల్లో నటించి మెప్పించాడు. కానీ ఏవీ కూడా అనుకున్నంతగా హిట్ కాలేకపోయాయి. దీంతో చాలా ఇయర్స్ ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. ప్రజెంట్ మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ ఉన్నాడు. అలా కిశోర్ అబ్బూరు(Kishore Abhooru) డైరెక్షన్‌లో ‘లెనిన్’(Lenin) అనే మూవీలో నటిస్తున్నాడు. ఇక ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన గ్లింప్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.

ఈ క్రమంలో సోషల్ మీడియా(Social Media)లో అక్కినేని అఖిల్‌కు సంబంధించిన ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో.. అఖిల్ సిక్స్ ప్యాక్‌తో దర్శనమిచ్చాడు. తన బ్లాక్ కలర్ బనీన్ తీసి భారీ కటౌట్‌ను చూపించాడు. ఒక్కసారిగా అఖిల్‌ను చూస్తే కండలు కలిగిన రారాజులా అనిపించాడు అని అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. దీంతో ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన అక్కినేని ఫ్యాన్స్, నెటిజన్లు అయ్యా అయ్యా అతని టాలెంట్‌ను ఇప్పటికైనా కరెక్టుగా వాడుకోండయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి లెనిన్ మూవీతో అయిన మన అయ్యగారు హిట్ కొడతాడేమో చూడాలి.

Click For Tweet Post..

Next Story