మళ్లీ గుడ్ న్యూస్ చెప్పనున్న అక్కినేని ఫ్యామిలీ.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

by I. Sairam |

అక్కినేని ఫ్యామిలీ(Akkineni Family) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని నాగేశ్వరరావు(Akkineni Nageswara Rao) ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి అప్పట్లో స్టార్ హీరోగా రాణించారు.

మళ్లీ గుడ్ న్యూస్ చెప్పనున్న అక్కినేని ఫ్యామిలీ.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని ఫ్యామిలీ(Akkineni Family) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని నాగేశ్వరరావు(Akkineni Nageswara Rao) ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి అప్పట్లో స్టార్ హీరోగా రాణించారు. ఆ తర్వాత అతని వారసుడు అయినా నాగార్జున(Nagarjuna) కూడా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఇక అతని వారసులైన అఖిల్(Akhil), నాగచైతన్య(Naga Chaitanya)లు కూడా సినిమాల్లో నటిస్తూ హీరోగా రాణిస్తున్నారు. ఇందులో భాగంగా రీసెంట్‌గా నాగ చైతన్య చందూ మొండేటి(Chandoo Mondeti) దర్శకత్వంలో ‘తండేల్’(Thandel) సినిమాలో నటించి మంచి విజయం సాధించాడు. నేచురల్ బ్యూటీ సాయిపల్లవి(Sai Pallavi) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను.. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించారు.

లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 2న రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయంతో పాటు కలెక్షన్ల సునామీ కూడా సృష్టిస్తోంది. ఇక ఇతని పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. సమంత(Samantha)తో విడాకుల తర్వాత స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(shobhitha Dhulipala)తో డేటింగ్‌లో ఉంటూ గత ఏడాది డిసెంబర్ 4న ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. అఖిల్ మాత్రం హీరోగా ఇప్పటి వరకు మంచి విజయం సాధించలేదనే చెప్పాలి. దీంతో ఎలాగైనా విజయం సాధించాలనే తపనతో ఉన్నాడు. ఇక అతని వ్యక్తిగత విషయానికి వస్తే.. రీసెంట్‌గా బడా బిజినెస్ మ్యాన్ కూతురు అయినా జైనాబ్ రవడ్జీ(Jainab Ravdzee)తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు.

ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున ఎక్స్ వేదికగా ప్రకటించడంతో అందరికీ ఈ న్యూస్ స్ప్రెడ్ అయింది. అయితే మ్యారేజ్ ఎప్పుడన్నది ప్రకటించలేదు. దీంతో వీరి మ్యారేజ్ డేట్ ఎప్పుడెప్పుడు అనౌన్స్ చేస్తారా అని అక్కినేని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో అఖిల్- జైనాబ్ పెళ్లికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హైదరాబాద్‌లోని నాగార్జున ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో అఖిల్, జైనాబ్‌ల ఎంగేజ్‌మెంట్ వేడుక జరిగిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు అఖిల్ పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయిందని తెలుస్తుంది. మార్చి 24న అఖిల్ వివాహం జరగబోతుందని తెలుస్తుంది.

ఇప్పటికే ఇరు కుటుంబాలు దీని గురించి చర్చలకు కూడా జరుపుకొని తేదీని ఫిక్స్ చేశారని టాక్. అఖిల్-జైనల్‌ల వివాహం ఘనంగా చేసేందుకు నాగార్జున ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ వివాహ వేడుకకు ఎంతో మంది ప్రముఖులు రానున్నారని అంటున్నారు. సినీ సెలబ్రెటీలు, రాజకీయ ప్రముఖులతో పాటు క్రికెటర్స్‌ను కూడా వీరి వివాహానికి ఆహ్వానించనున్నారని తెలుస్తుంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా అఖిల్ ప్రజెంట్ సీసీఏల్ లో బిజీగా ఉన్నాడు. అలాగే త్వరలోనే కొత్త సినిమాను కూడా అనౌన్స్ చేయనున్నాడు.

Next Story