పాన్ ఇండియా డైరెక్టర్‌తో అక్కినేని అఖిల్ సినిమా?

by Gantepaka Srikanth |

పాన్ ఇండియా డైరెక్టర్‌తో అక్కినేని అఖిల్ సినిమా?

పాన్ ఇండియా డైరెక్టర్‌తో అక్కినేని అఖిల్ సినిమా?
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు అక్కినేని అఖిల్‌(Akhil Akkineni)కు చెప్పుకోదగ్గ పెద్ద హిట్ లేదనే చెప్పొచ్చు. చివరగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఏజెంట్ చిత్రానికి ఎంతో కష్టపడినా ఫలితం అనుకున్న స్థాయిలో రాలేదు. దీంతో చాలా గ్యాప్ తీసుకుని ప్రస్తుతం ‘లెనిన్‌’గా ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు. ఇది ఆయన నటిస్తున్న 6వ చిత్రం. మురళీ కిశోర్‌ అబ్బూరు తెరకెక్కిస్తున్నారు. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్. ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రం తర్వాత అఖిల్.. పాన్ ఇండియా డైరెక్టర్‌ అయిన ప్రశాంత్‌ నీల్‌తో సినిమా చేయబోతున్నాడనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇటీవల ప్రశాంత్‌ నీల్‌తో అఖిల్ సమావేశం కావడంతో ఈ న్యూస్ వైరల్ అవుతోంది. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే.. చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి ఉండాల్సిందే. చేయాల్సి ఉంది.

Next Story