- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్కినేని అఖిల్ రిసెప్షన్ ఫొటోలు వైరల్.. హైలైట్‌గా నిలిచిన సూపర్‌స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ
టాలీవుడ్ నటుడు అఖిల్ అక్కినేని తన చిరకాల ప్రేయసి జైనాబ్‌ను హైదరాబాద్‌లో హిందూ వేడుకలో వివాహం చేసుకున్నాడు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ నటుడు అఖిల్ అక్కినేని తన చిరకాల ప్రేయసి జైనాబ్‌ను హైదరాబాద్‌లో హిందూ వేడుకలో వివాహం చేసుకున్నాడు. జైనాబ్.. సౌదీకి చెందిన వ్యాపారవేత్త జుల్ఫీ రావ్జీ కుమార్తె అన్న విషయం తెలిసిందే. అఖిల్ అండ్ జైనాబ్ జూన్ 6 వ తారీకున ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టారు. శుక్రవారం జూబ్లిహిల్స్‌లోకి నాగార్జున నివాసంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
దీంతో అక్కినేని అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. పలువురు సినీ ప్రముఖులు అఖిల్ పెళ్లికి హాజరై సందడి చేశారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇకపోతే వీరిద్దరు గత ఏడాదే నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. కానీ ఈ విషయాన్ని వీరు నవంబరు 26 వ తేదీన అఖిల్‌తో పాటు తల్లి అమల అండ్ తండ్రి నాగార్జున సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.
అయితే తాజాగా అఖిల్ అండ్ జైనాబ్ రిసెప్షన్ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమానికి చిరంజీవి దంపతులు, రామ్ చరణ్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. వీరితో పాటు సూపర్ స్టార మహేష్ బాబు ఫ్యామిలీ కూడా హాజరై హైలెట్‌గా నిలిచారు. ఇందుకు సంబంధించిన ఫొటోల్ని అన్నపూర్ణ స్టూడియోలు ట్విట్టర్ ద్వారా పంచుకుంది. ప్రస్తుతం మహేష్ బాబు ఫ్యామిలీ పిక్ సోషల్ మీడియాలోని నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మహేష్ బాబు అండ్ అఖిల్ లుక్ సేమ్ ఉందంటూ పలువురు జనాలు కామెంట్లు చేస్తున్నారు. ఇద్దరి ఫొటోను ఎడిట్ చేసి నెట్టింట వైరల్ చేస్తున్నారు.






