- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Akhil: ‘మై ఎవ్రీథింగ్’ అంటూ కాబోయే భార్యను హగ్ చేసుకున్న ఫొటో పంచుకున్న అక్కినేని హీరో
సిసింద్రీ సినిమాతో బాలనటుడిగా నటించి.. ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు అక్కినేని అఖిల్.

దిశ, వెబ్‌డెస్క్: సిసింద్రీ సినిమాతో బాలనటుడిగా నటించి.. ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు అక్కినేని అఖిల్. తర్వాత ఈ హీరో మనం, అఖిల్, హలో, ఆటాడుకుందాంరా, హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, ఏజెంట్ వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించాడు. కానీ ఇందులో పలు సినిమాలు జనాల్ని అంతగా ఆకట్టుకోలేదని చెప్పుకోవచ్చు. బాక్సాఫీసు వద్ద ఫ్లాప్ టాక్ సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం అఖిల్ మరో కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసిందుకు సిద్ధంగా ఉన్నాడు.
తాజాగా ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ మేకర్స్ రిలీజ్ చేశారు. ఇకపోతే అక్కినేని హీరో మూడు నెలల కిందట జైనాబ్ రావ్ జీ అనే అమ్మాయితో నిశ్చితార్థం జరుపుకున్న విషయం తెలిసిందే. వీరి నిశ్చితార్థం హైదరాబాదులోని నాగార్జున ఇంట్లో అంగరంగ వైభవంగా జరిగింది. కానీ అఖిల్ అండ్ జుల్ఫీ రావ్ జీ కుమార్తె అయిన ప్రముఖ ఆర్టిస్ట్ జైనబ్ ఎంగేజ్‌మెంట్‌కు తక్కువ మంది హాజరైనట్లు సమాచారం. ముందుగా ఈ శుభవార్తను నాగార్జున పంచుకున్నారు.
యువ జంటను ఆశీర్వదించండి అంటూ నాగ్ అండ్ అమల సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంత అక్కినేని అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే తాజాగా కాబోయే భార్యతో కలిసి జాలీగా గడుపుతున్నట్లు తెలుస్తోంది. జానాబ్ రావ్ జీ తో కలిసున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీగా పెట్టుకుని.. ‘మై ఎవ్రీథింగ్’ అని ఓ లవ్ సింబల్ జోడించాడు. ఇద్దరు సేమ్ కలర్ టీషర్ట్స్ ధరించి.. ఫొటోకు స్టిల్ ఇచ్చారు. ప్రజెంట్ ఈ కపుల్ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.






