- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Akhil- Jainab: ఫైనల్లీ అక్కినేని అఖిల్ పెళ్లైపోయిందోచ్.. ఆకట్టుకుంటున్న ఫొటోలు
అక్కినేని హీరో నాగార్జున రెండో కుమారుడు, నటుడు అక్కినేని అఖిల్(Akhil) వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు.

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని హీరో నాగార్జున రెండో కుమారుడు, నటుడు అక్కినేని అఖిల్(Akhil) ఎట్టకేలకు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. తన ప్రియురాలు జైనబ్ రవడ్జీ మెడలో మూడు ముళ్లు వేశారు. జూబ్లీహిల్స్‌లోని నాగార్జున ఇంటిలో శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటలకు వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాలతో పాటు అత్యంత దగ్గరి సన్నిహితులు, స్నేహితుల సమక్షంలోనే వీరి వివాహం జరిగింది.
ఇక వీరి వివాహ మహాత్సవానికి మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) దంపతులు, రామ్‌చరణ్(Ram Charan)-ఉపాసన(Upasana) దంపతులు, దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth Neel) తదితరులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. అనంతరం పెళ్లి బరాత్ నిర్వహించగా.. నాగార్జున, నాగచైతన్య తదితరులు డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






