అక్కినేని హీరో చుట్టూ పరువు హత్య కేసు

by Chukka Sudharani |

అక్కినేని హీరో అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’.

అక్కినేని హీరో చుట్టూ పరువు హత్య కేసు
X

దిశ, సినిమా: అక్కినేని హీరో అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో నిఖిల్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్, అప్డేట్స్ ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై హై ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. అంతేకాకుండా.. అఖిల్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత హిట్ పడకపోవడంతో.. అఖిల్‌తో పాటు అక్కినేని ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

దీంతో ఈ సినిమా నుంచి వచ్చే అప్డేట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్‌తో చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుండగా.. ఈ సినిమా మొత్తం పరువ హత్యల చుట్టూ తిరుగుతోందని తెలుస్తోంది. అయితే.. ఇందులో హీరో క్యారెక్టర్ ఏంటీ అనేది తెలియాల్సి ఉంది. కాగా.. మరో ఇంపార్టెంట్ బజ్ ఏంటంటే.. ఈ సినిమా కోసం భారీగానే ప్లాన్ చేస్తున్న చిత్ర బృందం ఇందులో ఓ స్పెషల్ సాంగ్ పెట్టాలని చూస్తున్నారట. ఈ స్పెషల్ సాంగ్ కోసం క్రేజీ బ్యూటీ అనన్య పాండేను సంప్రదించారట మేకర్స్. ఆమె కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తుండగా.. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రాలేదు.

Next Story