Akhil Akkineni : అభిమాని ఇంటికి వెళ్లి సర్ప్రైజ్ చేసిన అఖిల్

by Ajay Maddhiboyina |   (  Updated:2026-01-10 11:37:47  IST  )

టాలీవుడ్ యంగ్ హీరో, అక్కినేని వారసుడు అఖిల్ విజయవాడలోని తన అభిమాని ఇంటికి వెళ్లి సర్ప్రైజ్ చేశాడు. అక్కినేని నాగేశ్వర రావు కాలం నుండి ఆ కుటుంబాన్నే అభిమానిస్తున్న ఓ సీనియర్ అభిమాని ఇంటికి అఖిల్ వెళ్లాడు.

Akhil Akkineni  : అభిమాని ఇంటికి వెళ్లి సర్ప్రైజ్ చేసిన అఖిల్
X

దిశ‌, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో, అక్కినేని వారసుడు అఖిల్ విజయవాడలోని తన అభిమాని ఇంటికి వెళ్లి సర్ప్రైజ్ చేశాడు. అక్కినేని నాగేశ్వర రావు కాలం నుండి ఆ కుటుంబాన్నే అభిమానిస్తున్న ఓ సీనియర్ అభిమాని ఇంటికి అఖిల్ వెళ్లాడు. కాసేపు ఆయనతో ముచ్చటించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. అఖిల్ స్వయంగా ఇంటికి రావడంతో ఆ కుటుంబ సభ్యులు మురిసిపోయారు. ప్రస్తుతం దీనికిి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇదిలా ఉంటే అఖిల్ అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తన అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు చాలా సినిమాలు చేసినా స‌రైన హిట్ మాత్రం ప‌డ‌లేదు. క్లాస్, మాస్, ల‌వ‌ర్ బాయ్ ఇలా అన్ని జోన‌ర్లు ప్ర‌య‌త్నించినా అదృష్టం మాత్రం వ‌రించ‌లేదు. దీంతో ఇప్ప‌టికే స‌రైన హిట్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. ఇక అఖిల్ ప్ర‌స్తుతం లెనిన్ సినిమాలో న‌టిస్తుండ‌గా ఈ చిత్రం స‌మ్మ‌ర్ లో విడుద‌ల కానుంది. ముర‌ళీ కిషోర్ అబ్బూరు ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. భాగ్య‌శ్రీ బోర్సే అఖిల్ కు జోడీగా న‌టిస్తోంది.

Next Story