- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘లెనిన్’ టీజర్ వచ్చేసింది.. ఈ లెనిన్ గాడు నిప్పంటూ అదరగొట్టేసిన అఖిల్
అక్కినేని హీరో అఖిల్ నటిస్తున్న ‘లెనిన్’ చిత్రం నుంచి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.

దిశ, సినిమా: అక్కినేని ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘లెనిన్’ టీజర్ వచ్చేసింది. అఖిల్ హీరోగా, యువ దర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వాయిదాలు పడుతూ వస్తుండగా అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫైనల్‌గా జూన్ 26న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతుండగా ప్రమోషన్స్‌తో ప్రేక్షకుల్లోకి చిత్రాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ గమనించినట్లైతే.. భాగ్యశ్రీ బోర్సే నటకం ప్రదర్శిస్తున్న క్లిప్‌తో స్టార్ట్ అవ్వడగా.. ‘ఈ లెనిన్ గాడు నిప్పు.. మనోడు వస్తున్నాడు.. నేను తప్పిపోయి రాలేదు మీ అందరినీ వెతుక్కుంటూ వచ్చా’ అంటూ అఖిల్ చెప్పిన డైలాగ్స్ హైలెట్‌గా నిలిచాయి. అలాగే అఖిల్ బొట్టు పెట్టుకుని కూల్ అండ్ ఇన్నోసెంట్ లుక్‌లో కనిపిస్తూనే.. మాస్ ఎలిమెంట్స్, ఫైట్స్‌తో అదరగొట్టాడు. మొత్తంగా ఈ టీజర్‌తో మనోడు ఈసారి హిట్ కొడతాడు అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్.
అఖిల్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతున్న సరైన హిట్ ఇప్పటికీ పడకపోవడంతో.. అఖిల్‌తో పాటు అక్కినేని ఫ్యాన్స్ సైతం ‘లెనిన్’పైనే ఆశలు పెట్టుకున్నారు. దీంతో అఖిల్ సైతం ఈ చిత్రం కోసం ఎంతో కష్టపడినట్లు తాజాగా రిలీజ్ చేసిన టీజర్ చూస్తే అర్థం అవుతుంది. అంతే కాకుండా.. రిలీజ్ చేసిన టీజర్‌లో యాక్షన్, ఎమోషనల్ సీన్స్, మాస్ అంశాలు సమపాళ్లలో ఉండటంతో ఈ సినిమా కచ్చితంగా అఖిల్‌కు మంచి కమ్ బ్యాక్ ఇస్తుందని ఆశిస్తున్నారు ఫ్యాన్స్. కాగా.. ఈ చిత్రంలో నిఖిల్ సరసన యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుంది.






