అదిరిపోయే అప్డేట్ తో అఖిల్.. ఈ సారి ప‌క్కా హిట్టే..!

by velandi.Saikiran |

Lenin Moive : 5వ తేదీన Lenin Moive మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నారట.

అదిరిపోయే అప్డేట్ తో అఖిల్.. ఈ సారి ప‌క్కా హిట్టే..!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: అక్కినేని నాగార్జున కుమారుడు అక్కినేని అఖిల్ హిట్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. సాయికుమార్ కొడుకు ఇటీవల హిట్ అందుకోగా ఇప్పుడు అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్ కొట్టాలని సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అఖిల్ నటిస్తున్న త‌న ఆరవ సినిమా లెనిన్ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. అక్కినేని ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా ఈ మూవీ నుంచి అప్డేట్ వదిలారు.

ఈ నెల 5వ తేదీన ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నారట. అదే సమయంలో 2026 సమ్మర్ లో ఈ మూవీని రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇందులో భాగంగానే మాస్ లుక్ లో ఉన్న అక్కినేని అఖిల్ పోస్టర్ ను వదిలింది. ఈ పోస్టర్ లో కాలర్ ఎగరేసుకొని, న‌డుస్తూ అఖిల్ కనిపించాడు. కాగా ఈ సినిమాలో అఖిల్ హీరోగా నటిస్తున్న నేపథ్యంలో భాగ్యశ్రీ హీరోయిన్ గా చేస్తోందట. శివాజీ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. మురళీ కిషోర్ అబ్బూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

Next Story