హీరోయిన్ తో డ్యాన్స్ ఇర‌గ‌దీసిన‌ అఖిల్

by velandi.Saikiran |

రో అఖిల్, భాగ్యశ్రీ వేసే స్టెప్పులు చాలా అందంగా ఉన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఈవెంట్ లో ప్రేక్షకుల కోసం హీరో, హీరోయిన్లు స్టెప్పులు వేశారు.

హీరోయిన్ తో డ్యాన్స్ ఇర‌గ‌దీసిన‌ అఖిల్
X

దిశ‌, వెబ్ డెస్క్‌: అఖిల్ అక్కినేని హిట్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఓ డిఫరెంట్ కథాంశంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు హీరో అఖిల్ అక్కినేని. ఆ సినిమానే లెనిన్ ( LENIN). మాస్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా వస్తోందట. అఖిల్ అక్కినేని హీరోగా చేస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ హీరోయిన్ గా మెరువనున్నారు. మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ తెరకెక్కిస్తున్నాయి.

భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా మే ఒకటో తేదీన ఈ ఏడాది రిలీజ్ కానుంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ అందరినీ ఆకట్టుకుంటుంది. వారే వా వా వారేవా పేరుతో సాగే ఈ పాట యూట్యూబ్ ని కూడా షేక్ చేస్తోంది. అయితే ఇందులో హీరో అఖిల్, భాగ్యశ్రీ వేసే స్టెప్పులు చాలా అందంగా ఉన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఈవెంట్ లో ప్రేక్షకుల కోసం హీరో, హీరోయిన్లు స్టెప్పులు వేశారు. ఈ వీడియో వైరల్ గా మారింది.







Next Story