- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Akhil: 'లెనిన్' కథ చెప్పాక వేరే హీరోతో తీయొద్దని దర్శకుడిని రిక్వెస్ట్ చేశా
'లెనిన్' కథ విన్న క్షణమే వేరే హీరోతో చేయొద్దని దర్శకుడిని కోరినట్లు అఖిల్ వెల్లడించాడు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ తాజాగా 'లెనిన్' చిత్రంలో హీరోగా నటించాడు. ఈ సినిమా జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో నిన్న తిరుపతిలో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్రబృందంతో పాటు నిర్మాతల్లో ఒకరైన నాగార్జున కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అఖిల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అఖిల్ మాట్లాడుతూ.. "నా చివరి సినిమా విడుదలై చాలా కాలమైంది. మంచి సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు రావాలనే ఉద్దేశంతోనే ఇంత సమయం తీసుకున్నాను.
దర్శకుడు నందు (మురళీ కిషోర్ అబ్బూరు) ఈ సినిమా కథ చెప్పిన వెంటనే నాకు ఎంతో నచ్చింది. వెంటనే ఈ కథను వేరే హీరోతో చేయొద్దని, నాతోనే చేయాలని ఆయనను రిక్వెస్ట్ చేశాను. ఈ సినిమాను మొదట నాగ వంశీ గారే నిర్మించాలని అనుకున్నారు. కానీ నేను కూడా నిర్మాతగా ఉంటానని చెప్పాను. ఆ తర్వాత నాన్నగారు నాగార్జున, నాగ వంశీ కలిసి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిద్దామని నిర్ణయించి షేక్‌హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఆ క్షణం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఈ సినిమాను ప్రేక్షకులు అద్భుతంగా ఆస్వాదిస్తారని నేను నమ్ముతున్నానని అఖిల్ చెప్పుకొచ్చారు.






