- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలయ్య ఫ్యాన్స్‌కు బిగ్ షాక్..‘అఖండ-2’ మూవీ షోలు రద్దు !
అఖండ 2 ప్రీమియర్స్ కోసం ఎదురుచూస్తున్న బాలయ్య అభిమానులకు డిస్ట్రిబ్యూటర్లు షాక్ ఇచ్చారు. చివరి నిమిషంలో ప్రీమియర్స్

దిశ, వెబ్ డెస్క్: నందమూరి బాలయ్య అభిమానులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. బాలయ్య హీరోగా నటించిన అఖండ 2 సినిమా ప్రీమియర్స్ రద్దయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో అఖండ 2 ప్రీమియర్స్ కోసం ఎదురుచూస్తున్న బాలయ్య అభిమానులకు డిస్ట్రిబ్యూటర్లు షాక్ ఇచ్చారు. చివరి నిమిషంలో ప్రీమియర్స్ రద్దు చేశారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇవాళ ప్రీమియర్స్ ఉండబోవని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో బాలయ్య ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు.
అయితే ఓవర్సీస్ లో మాత్రం అఖండ 2 ప్రీమియర్స్ యధావిధిగా ఉంటాయని వెల్లడించింది. అయితే ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రీమియర్ షోలు మొదలవుతాయని ప్రకటన వచ్చినా, టికెట్లపై సమాచారం లేక ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. టికెట్ కొనుగోలు చేసిన అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు. కాగా, ప్రీమియర్ షోలు రద్దు కావడంతో రేపు అఖండ 2 థియేటర్ లలో రిలీజ్ కానుంది. కాగా నందమూరి బాలయ్య హీరోగా చేసిన అఖండ 2 సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్ గా చేశాడు. ఇక ఈ మూవీలో సంయుక్త మీనన్ స్పెషల్ రోల్ చేస్తున్నారు.






