- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూల్స్ మార్చిన ఓటీటీలు.. అలా చేస్తే ఫస్ట్ బిగ్గెస్ట్ మూవీగా అఖండ -2
నిర్మాతలకు సేఫ్ సైడ్ గా మారిన ఓటీటీలు గత నెలలో షాకిచ్చాయి. సినిమా హిట్, ఫ్లాప్ ఆధారంగా ..

దిశ, వెబ్‌డెస్క్: నిర్మాతలకు సేఫ్ సైడ్ గా మారిన ఓటీటీలు గత నెలలో షాకిచ్చాయి. సినిమా హిట్, ఫ్లాప్ ఆధారంగా ఓటీటీలు సినిమాను కొనుక్కోవడం స్టార్ట్ చేశాయి. గతంలో అయితే హిట్టా , ఫట్టా అన్నది సంబంధం లేకుండా అగ్రిమెంట్ చేసుకున్న అమౌంట్ కు సినిమా కొనేవాళ్లు. కానీ.. ఇప్పుడు ఆ రూల్ మారింది. థియేటర్లలో సినిమా బాగా ఆడితేనే అగ్రిమెంట్ అమౌంట్ పై 25 శాతం అదనంగా చెల్లించనున్నాయి ఓటీటీలు. ఒకవేళ బాగా ఆడకపోతే అగ్రిమెంట్ అమౌంట్ నుంచి 25 శాతం తగ్గించనున్నాయి. అయితే ఈ కొత్త నెట్ ఫ్లిక్స్ మోడల్ ను ఫాలో కానున్న తొలి భారీ చిత్రంగా అఖండ -2 తాండవం నిలవనుంది. రిలీజుకు రెడీ అయిన ఈ బిగ్గెస్ట్ మూవీ.. కొత్త ఓటీటీ రూల్స్ ను పాటించనుంది.
కాగా.. చిన్న సినిమాలైతే 2-3 వారాలకు, కంటెంట్ ఉన్న సినిమాలు, పెద్దసినిమాలైతే గరిష్టంగా నాలుగు వారాలకు ఓటీటీల్లో రిలీజవుతున్నాయి. దీంతో థియేటర్లలో సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపడం లేదు. కారణం ఏంటో అందరికీ తెలుసు. సినిమాల టికెట్ల రేట్లతో పాటు వాటర్ బాటిల్, పాప్ కార్న్, ఇతర స్నాక్స్ రేట్లు భారీగా ఉండటమే. నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ కలిసి సినిమా చూడాలంటే కనీసం రూ.2000 ఖర్చు చేయాల్సిన పరిస్థితి.
ఇక అఖండ -2 సినిమా విషయానికొస్తే.. బోయపాటి శ్రీను - బాలయ్యల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమ. మరో రెండ్రోజుల్లా సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ తో భారీ హైప్ క్రియేట్ అయింది. థియేటర్లలో అఖండగా బాలకృష్ణ రుద్రతాండవం కన్ఫర్మ్ అంటూ.. ఫ్యాన్స్ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.






