'అఖండ-2' టికెట్ ధరలు పెంపు...ఎంతంటే ?

by velandi.Saikiran |   (  Updated:2025-12-02 13:43:59  IST  )

నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ 2. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో హీరోగా

అఖండ-2 టికెట్ ధరలు పెంపు...ఎంతంటే ?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ 2. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో హీరోగా నందమూరి బాలయ్య చేస్తుండగా, సంయుక్త మీనన్ హీరోయిన్ గా మెరువనున్నారు. హిందూ ధర్మం చుట్టూ తిరిగే ఈ అఖండ 2 సినిమా డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ కు కేవలం మూడు రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఏపీలో అఖండ 2 సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు కూటమి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. డిసెంబ‌ర్ నాలుగో తేదీన ప్రీమియర్ షోకు 600 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ప్ర‌భుత్వం. ఐదవ తేదీన మల్టీప్లెక్స్ లలో 100 రూపాయలు, సింగిల్ థియేటర్ లో 75 రూపాయలు పెంచుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టికెట్ ధరలపై జీవో కూడా జారీ చేసింది ఏపీ సర్కార్.

డిసెంబర్ 4వ తేదీన రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు ప్రీమియర్ షోకు పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం. డిసెంబర్ 5వ తేదీ నుంచి పది రోజుల పాటు రోజు 5 షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది ఇలా ఉండగా బాలయ్య నటించిన అఖండ 2 సినిమాకు ప్రొడ్యూసర్లుగా రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట,ఇషాన్ సక్సేనా ఉన్నారు. ఎం తేజస్విని నందమూరి సమర్పణలో 14 వీల్స్ ప్లస్, ఐవివై ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై ఈ సినిమా వస్తోంది. ఈ అఖండ 2 సినిమా రెండు గంటల 50 నిమిషాల నిడివి కలిగి ఉంటుంది.

Next Story