- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Akhanda-2: భారీ వర్షాల్లో అఖండ-2 చిత్రీకరణ.. అలాంటి డేంజర్ ప్లేస్‌లో షూటింగ్ అవసరమా అంటున్న నెటిజన్లు.. విజువల్స్ వైరల్
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ వెయిటెడ్ మూవీ ‘అఖండ-2’.

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ వెయిటెడ్ మూవీ ‘అఖండ-2’. బ్లాక్ బస్టర్ హిట్ ‘అఖండ’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీపై నందమూరి ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. 14రీల్స్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తుండగా.. బాలయ్య చిన్న కూతురు తేజస్విని సహా నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఈ సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
ఈ క్రమంలోనే షూటింగ్‌లో వేగం పెంచిన మూవీ టీమ్.. వర్షం, వరదతో సంబంధం లేకుండా చిత్రీకరణ చేస్తున్నారు. ప్రస్తుతం ‘అఖండ-2’ షూటింగ్ రాజమండ్రి దగ్గరలోని మోతగూడెంలో జరుగుతుంది. పక్కన నుంచి వరద జోరుగా వెళ్తుండగా.. డైరెక్టర్ బోయపాటి సీన్ ఎక్స్‌ప్లేన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. భారీ వర్షాల్లో అలాంటి డేంజర్ ప్లేస్‌లో షూటింగ్ అవసరమా అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. లింక్






