ఫ్యాన్స్ కు మ‌రో షాక్‌.. రేపు కూడా అఖండ 2 క‌ష్ట‌మేనా ?

by velandi.Saikiran |

బాలయ్య అభిమానులకు నిరాశ ఎదురయింది. తెలుగు రాష్ట్రాలలో విడుదల కావలసిన అఖండ 2 సినిమా ప్రీమియర్లు

ఫ్యాన్స్ కు మ‌రో షాక్‌.. రేపు కూడా అఖండ 2 క‌ష్ట‌మేనా ?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: బాలయ్య అభిమానులకు నిరాశ ఎదురయింది. తెలుగు రాష్ట్రాలలో విడుదల కావలసిన అఖండ 2 సినిమా ప్రీమియర్లు రద్దయ్యాయి. ఇవాళ రాత్రి 8 గంటల సమయంలో ఈ ప్రీమియర్ షోలు రిలీజ్ అవుతాయని ముందే చిత్ర బృందం ప్రకటించింది. దీంతో ఈ సినిమా చూసేందుకు అభిమానులు అందరూ ఎగబడ్డారు. కానీ సినిమా రిలీజ్ కంటే 2 గంటల ముందు ప్రీమియర్లు రద్దు చేస్తున్నట్లు 14 వీల్స్ ఎంటర్టైన్మెంట్ అధికారికంగా ప్రకటించింది. సాంకేతిక కారణాల వల్ల, ఈ సినిమా ప్రీమియర్లు రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఓవర్సీస్ లో మాత్రం ఈ సినిమా ప్రీమియర్లు యధావిధిగా కొనసాగనున్నాయి.

అయితే ప్రీమియర్ షోలు రద్దు కావడంతో డీలాపడ్డ అభిమానులకు మరో ఊహించని షాక్‌ తగిలేలా కనిపిస్తోంది. ఈ సినిమా చిత్ర బృందం దాదాపు రూ. 40 కోట్లు ఫైనాన్స్ క్లియర్ చేయాలని, అందువల్లే ప్రీమియర్స్ ఆగిపోయినట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. టెక్నీషియన్స్ కు కూడా పేమెంట్ క్లియర్ చేయలేదట. దీంతో ఈ అంశంపై ఫిలిం ఛాంబర్ లో కంప్లైంట్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వివాదంపై చిత్ర బృందం దిగివచ్చి చర్చలు జరపకపోతే, రేపు మార్నింగ్ షో కూడా పడే అవకాశాలు లేనట్లే అని చెబుతున్నారు.

రేపు ఉదయం వరకు ఈ సమస్య పరిష్కరించకపోతే, అఖండ 2 సినిమా వాయిదా పడే ప్రమాదం కూడా ఉన్నట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీనిపై ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. అయితే ఇది తెలిసిన ఫ్యాన్స్ కూడా రియాక్ట్ అవుతున్నారు. నందమూరి బాలయ్యనే రంగంలోకి దిగాలని, అప్పుడు సమస్య సద్దుమణుగుతుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. క్లిక్

Next Story