- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు కాశీలో అఖండ-2 ప్రెస్ మీట్?
బోయపాటి శ్రీను, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణల క్రేజీ కాంబినేషన్లో రీసెంట్ గా విడుదలైన..

దిశ, వెబ్‌డెస్క్: బోయపాటి శ్రీను, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణల క్రేజీ కాంబినేషన్లో రీసెంట్ గా విడుదలైన అఖండ-2 తాండవం సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో సనాతన ధర్మ పరిరక్షణ అంశాన్ని చూపించడంతో దీనిపైనే ప్రధాన చర్చ జరుగుతోంది. ఇక మౌత్ టాక్ తోనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తుండటంతో చిత్రబృందం సంతోషం వ్యక్తం చేసింది. తాజాగా బాలయ్య, బోయపాటి కాశీకి వెళ్లినట్లు తెలుస్తోంది.
అఖండ-2కి మంచి రెస్పాన్స్ రావడంతో కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం అక్కడే ఉన్న వీరిద్దరూ.. శుక్రవారం.. స్థానికంగా ప్రెస్ మీట్ పెట్టి.. సినిమాపై మీడియాతో ముచ్చటించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. సినిమా విషయానికొస్తే బాలయ్య కూతురిగా హర్షాలీ మల్హోత్రా నటించగా.. సంయుక్త మీనన్ కీలకపాత్ర పోషించింది. థమన్ అందించిన సంగీతం, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి.






