- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అఖండ 2కు షోలు రద్దు..ఆ హీరో వల్లే అంటూ పోస్టులు ?
ఓవర్సీస్ లో మాత్రం అఖండ 2 ప్రీమియర్లు పడిపోనున్నాయి. అయితే, ఇలా అర్ధాంతరంగా ప్రీమియర్లు ఆగిపోవడానికి ఓ ప్రత్యేక కారణం

దిశ, వెబ్ డెస్క్: నందమూరి బాలయ్య లేటెస్ట్ గా నటించిన అఖండ 2 సినిమా రేపు రిలీజ్ కాబోతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రీమియర్లు ఇవాళ రాత్రి 8 గంటలకు పడాల్సి ఉంది. కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ప్రీమియర్లు వేయలేకపోతున్నట్లు చిత్ర బృందం సాయంత్రం ప్రకటించింది. దీంతో ఈ సినిమా కోసం టికెట్లు కొనుగోలు చేసిన వాళ్లంతా గందరగోళానికి గురవుతున్నారు.
ఓవర్సీస్ లో మాత్రం అఖండ 2 ప్రీమియర్లు పడిపోనున్నాయి. అయితే, ఇలా అర్ధాంతరంగా ప్రీమియర్లు ఆగిపోవడానికి ఓ ప్రత్యేక కారణం ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దినంతటికీ కారణం మహేష్ బాబు సినిమాలని కొంతమంది పోస్టులు పెడుతున్నారు. అఖండ 2 సినిమా ప్రెసెంట్ చేస్తున్న 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ, ఈరోస్ సంస్థకు డబ్బులు చెల్లించాల్సిన వివాదం ఇంకా కొనసాగుతోందట.
మహేష్ బాబు హీరోగా చేసిన నేనొక్కడినే వన్, ఆగడు సినిమాల వల్ల ఈరోస్ సంస్థకు నష్టాలు వచ్చినట్లు సమాచారం. ఆ నష్టాల్లో భాగంగా దాదాపు రూ.28 కోట్లు 14 రీల్స్ ఇవ్వాల్సి ఉందట. దీంతో ఈ సినిమా ప్రీమియర్లు ఆగిపోయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ప్రీమియర్లు రద్దు కావడంతో ఆ టికెట్ల డబ్బులు రిఫండ్ చేస్తున్నట్లు సమాచారం. కాగా రేపు ఉదయం వరకు ఈ సమస్య పరిష్కరించుకొని సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. క్లిక్






