- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు అఖండ-2 ప్రీ రిలీజ్ ఈవెంట్..గెస్టులు ఎవరంటే?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) హాజరవుతారని దాదాపు ఫైనల్ అయింది. ముందుగా అల్లు అర్జున్

దిశ, వెబ్ డెస్క్: నందమూరి బాలయ్య ( Nandamuri Balayya ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఏ సినిమా చేసినా, బంపర్ హిట్టే. అయితే అలాంటి నందమూరి బాలయ్య ఇప్పుడు అఖండ 2 ( Akhand 2 ) సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. బోయపాటి శ్రీను ( Boyapati Srinu), నందమూరి బాలయ్య కాంబినేషన్ లో ఈ సినిమా వస్తోంది. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే వచ్చిన అఖండ సినిమా చరిత్ర సృష్టించింది. ఆ సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు అఖండ 2 రాబోతోంది. డిసెంబర్ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఇలాంటి నేపథ్యంలో ప్రమోషన్స్ వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ అంచనాలను భారీగా పెంచాయి.
ఇక ఇవాళ అఖండ 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించబోతోంది చిత్ర బృందం. హైదరాబాద్ లోని కూకట్ పల్లి కైతలాపూర్ గ్రౌండ్స్ లో ఈ ఈవెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవాళ సాయంత్రం 5 గంటల తర్వాత ఈ మెగా ఈవెంట్ ఉండనుంది. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) హాజరవుతారని దాదాపు ఫైనల్ అయింది. ముందుగా అల్లు అర్జున్ కూడా ఈ ఈవెంట్ కి వస్తారని అందరూ ప్రచారం చేశారు. కానీ బిజీ షెడ్యూల్ కారణంగా అల్లు అర్జున్ ఈవెంట్ కు దూరం అవుతున్నారట. అయితే అఖండ 2 సినిమా సక్సెస్ మీట్ లో మాత్రం అల్లు అర్జున్ హాజరవుతారని తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా అఖండ 2 సినిమాకు తమన్ మ్యూజిక్ అందించారు. ఇక ఇందులో బాలయ్య హీరోగా చేస్తుండగా, సంయుక్త మీనన్ హీరోయిన్ గా మెరువనున్నారు. ఆది పినిశెట్టి విలన్ గా దుమ్ములేపనున్నారట.






