బుకింగ్స్ లో అఖండ-2 తాండవం..

by Naga Rani Yarlagadda |

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ -2 తాండవం..

బుకింగ్స్ లో అఖండ-2 తాండవం..
X

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ -2 తాండవం డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. రిలీజైన వారంరోజులకే ఈ సినిమా ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. వీకెండ్ రోజుల్లోనే కాకుండా.. వీక్ డేస్ లలో కూడా ఎంతో డీసెంట్ గా ముందుకు సాగుతోంది. ఈ సినిమా టికెట్స్ బుకింగ్స్ పై మేకర్స అధికారిక ప్రకటన చేశారు. సినిమా టికెట్ల బుకింగ్స్ లో సాలిడ్ రెస్పాన్స్ వచ్చినట్లు 14 రీల్స్ ప్లస్ ఎక్స్ లో పోస్టు పెట్టింది.

బుక్ మై షో, డిస్ట్రిక్ట్, పేటీఎం వంటి యప్స్ లో అఖండ 2కి 20 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. దీనితో అఖండ 2 తాండవంకి మాస్ రెస్పాన్స్ నే పాన్ ఇండియా లెవెల్లో వచ్చింది అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రంలో సంయుక్త మీనన్, హర్షాలీ మల్హోత్రా అలాగే ఆది పినిశెట్టి తదితరులు కీలక పాత్రల్లో నటించగా తమన్ సంగీతం అందించాడు.

Next Story