- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సస్పెన్ష్ కు తెర.. అఖండ 2 కొత్త రిలీజ్ డేట్ ఇదే ?
అఖండ 2 కొత్త రిలీజ్ డేట్ ఇదే ? 12వ తేదీన లేకపోతే, 25న రిలీజ్ చేయనున్నారట. ఈ మేరకు పోస్టులు వైరల్ అవుతున్నాయి

దిశ, వెబ్ డెస్క్: నందమూరి బాలయ్య తాజాగా నటించిన సినిమా అఖండ 2. ఈ సినిమాను బోయపాటి శ్రీను చాలా గ్రాండ్ గా తెరకెక్కించారు. అఖండ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 వస్తోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే పెరిగిపోయాయి. ఇక నందమూరి బాలయ్య హీరోగా చేసిన అఖండ 2 సినిమాను ఇవాళ రిలీజ్ చేయాలని అనుకున్నారు. గురువారం రోజున ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. ఇలాంటి తరుణంలో అఖండ 2 టీంకు ఊహించని షాక్ తగిలింది.
ఎరోస్ కు 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వాల్సిన పాత బకాయిల కారణంగా అఖండ 2 సినిమా రిలీజ్ కు బ్రేక్ పడింది. అయితే, నిన్నటి నుంచి దీనిపై చర్చ జరుగుతోంది. దాదాపు రూ.40 కోట్ల బకాయిలు సెటిల్ అయినట్లు టాక్ నడుస్తోంది. దీంతో సినిమాను రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారట. అయితే, ఈ అఖండ 2 సినిమాను ఈ నెల 12వ తేదీన లేకపోతే, డిసెంబర్ 25న రిలీజ్ చేయనున్నారట. ఈ మేరకు పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. క్లిక్






