'ఆకాశంలో ఒక తార' మూవీ అప్డేట్.. ఆమె ఫస్ట్ గ్లిమ్మర్ రాబోతుందంటూ పోస్ట్..

by Gugulothu.Kavitha |   (  Updated:2026-01-18 13:48:49  IST  )

దుల్కర్ సల్మాన్(Dulquer Salman) ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘ఆకాశంలో ఒక తార’(Akasamlo Oka Tara).

ఆకాశంలో ఒక తార మూవీ అప్డేట్.. ఆమె ఫస్ట్ గ్లిమ్మర్ రాబోతుందంటూ పోస్ట్..
X

దిశ, వెబ్‌డెస్క్: దుల్కర్ సల్మాన్(Dulquer Salman) ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘ఆకాశంలో ఒక తార’(Akasamlo Oka Tara). దర్శకుడు పవన్ సాదినేని(Pawan Sadineni) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా బ్యానర్లు సమర్పిస్తుండగా లైట్ బాక్స్ మీడియా బ్యానర్‌పై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక దీనికి జి.వి.ప్రకాష్ కుమార్(GV Prakash Kumar) సంగీతం అందిస్తున్నాడు. ఇక సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ తెలుగు, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి రేపు ఓ అప్డేట్ రాబోతుందంటూ మూవీ టీమ్ వెల్లడించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ స్పెషల్ పోస్టర్‌ను షేర్ చేస్తూ.. ‘ఆమె ఆకాశాన్ని తాకినప్పుడు... ఆమె మొదటి మిణుగురు చూపు రేపు ఉదయం 11:00 గంటలకు రాబోతుంది’ అని రాసుకొచ్చారు. ఇక పోస్టర్‌లో ఓ హీరోయిన్ లంగా ఓణీ, పెద్ద జుట్టుతో చాలా ట్రెడిషనల్‌గా కనిపించింది. ఇక చేతిని పైకి ఎత్తి ఆగండి అనేలా పోజు పెట్టింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. మరి ఆ భామ ఎవరో తెలియాలంటే రేపు ఉదయం 11 గంటల వరకు వెయిట్ చేయాల్సిందే.

READ MORE ....

ఓటీటీలోకి వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ కానుందంటే?

Next Story