ఓటీటీలోకి వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ కానుందంటే?

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-18 13:49:05  IST  )

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్(Kichcha Sudeep) ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘మార్క్’ (Mark)ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఓటీటీలోకి వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ కానుందంటే?
X

దిశ, సినిమా: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్(Kichcha Sudeep) ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘మార్క్’ (Mark)ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. నవీన్ చంద్ర, యోగిబాబు, విక్రాంత్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించారు. గత ఏడాది క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. థియేట్రికల్ రిలీజ్ సమయంలో తెలుగులో భారీ చిత్రాలు పోటీలో ఉండటం వల్ల ‘మార్క్’కు సరైన సంఖ్యలో థియేటర్లు దక్కకపోవడం మైనస్‌గా మారింది. అలాగే కథలో కొన్ని ట్విస్టులు ఊహించదగినవిగా ఉండటం వల్ల సినిమాకు కావాల్సిన స్థాయిలో హిట్ టాక్ రాలేదు.

అయినప్పటికీ, యాక్షన్ థ్రిల్లర్ జానర్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు అందించిందనే అభిప్రాయం కూడా వినిపించింది. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ‘మార్క్’ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్ సొంతం చేసుకోగా, జనవరి 23 నుంచి తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు, యాక్షన్ థ్రిల్లర్ అభిమానులు ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమాను ఆస్వాదించే అవకాశం దక్కింది. థియేటర్ ఫలితాలతో సంబంధం లేకుండా, ఓటీటీలో ‘మార్క్’కి రెండో అవకాశం దక్కిందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Read More..

ఇలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. సూరి మాటలతో ‘మందాడి’పై భారీ హైప్

Next Story