- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Akash: పెద్ద మనసు చాటుకున్న యంగ్ హీరో.. నటి పావలా శ్యామల వీడియోకు స్పందన
డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు, యంగ్ హీరో ఆకాశ్ పూరి తన పెద్ద మనసు చాటుకున్నాడు.

దిశ, వెబ్ డెస్క్: డైరెక్టర్ పూరి జగన్నాథ్(Director Puri Jagannath) తనయుడు, యంగ్ హీరో ఆకాశ్ పూరి(Akash Puri) తన పెద్ద మనసు చాటుకున్నాడు. సీనియర్ నటి పావలా శ్యామల(Pavala Shyamala)కు సాయం అందించాడు. నటి పావలా శ్యామల ఇటీవల తన దీన స్థితిని వివరిస్తూ.. సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో విడుదల చేశారు. తన ఆర్థిక పరిస్థితి బాగాలేదని, ఆసుపత్రిలో చూపించుకునేందుకు డబ్బులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాక పెద్ద పెద్ద హీరోలతో నటించి, ఇప్పుడు ఏ దిక్కూ లేక ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉన్నానని చెప్పారు.
దయచేసి ఎవరైనా తనను ఆదుకోవాలని శ్యామల వీడియో ద్వారా వేడుకున్నారు. ఈ వీడియోపై స్పందించిన హీరో ఆకాశ్ పూరి పావలా శ్యామలను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. శ్యామల ఉన్న ఆశ్రమానికి వెళ్లి ఆమెను పరామర్శించారు. అలాగే ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆశ్రమ నిర్వాహకులను ఆరా తీశారు. ఈ సందర్భంగా రూ. 1 లక్ష విరాళాన్ని పావలా శ్యామలకు ఆకాశ్ పూరి అందించారు. అంతేగాక ఆమెకు ఎలాంటి సాయం చేయడానికి అయినా సిద్దంగా ఉంటానని యువ హీరో(Young Hero) హామీ ఇచ్చారు.
Read More..
Ashika Ranganathan: వైన్ తాగుతూ చిల్ అవుతున్న యంగ్ హీరోయిన్... ఫొటోలు వైరల్






