- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టైటిల్ పోస్టర్ చూస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి.. ‘విలయ తాండవం’ అకాష్ పూరి కామెంట్స్ వైరల్
యంగ్ టాలెంటెడ్ కార్తీక్ రాజు, పార్వతి అరుణ్, పుష్ప ఫేమ్ జగదీష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విలయ తాండవం’.

దిశ, సినిమా: యంగ్ టాలెంటెడ్ కార్తీక్ రాజు, పార్వతి అరుణ్, పుష్ప ఫేమ్ జగదీష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విలయ తాండవం’. జీఎంఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా మందల ధర్మా రావు, గుంపు భాస్కర రావు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వీఎస్ వాసు దర్శకత్వం వహిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ కొత్త ప్రాజెక్ట్‌కి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను బుధవారం విడుదల చేశారు మేకర్స్. దీనికి స్పెషల్ గెస్ట్‌లుగా ఆకాష్ పూరి, భీమనేని శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆకాష్ పూరి మాట్లాడుతూ.. ‘‘విలయ తాండవం’ టైటిల్ ఎంతో పవర్ ఫుల్‌గా ఉంది. ఈ ఈవెంట్‌కు నన్ను ఆహ్వానించిన టీంకు థాంక్స్. టైటిల్ పోస్టర్ చూస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. కార్తీక్ రాజుకి మరోసారి ఈ చిత్రంతో మంచి పేరు రావాలని, సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘కార్తీక్ రాజు నేను తీసిన ‘కౌసల్యా కృష్ణమూర్తి’ చిత్రంలో నటించారు. కార్తీక్ ఎప్పుడూ డిఫరెంట్ కథల్నే ఎంచుకుంటారు. సినిమా పట్ల ఆయనకు ఎంతో ప్యాషన్ ఉంది. ఈ ‘విలయ తాండవం’తో మరోసారి కార్తీక్ రాజుకి హిట్ రావాలి. టైటిల్ పోస్టర్ అయితే నాకు చాలా నచ్చింది. కంటెంట్ బేస్డ్ చిత్రాల్ని జనాలు ఇప్పుడు ఎక్కువగా ఆదరిస్తున్నారు. అలానే ‘విలయ తాండవం’ మూవీని పెద్ద హిట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని తెలిపారు.






