ఊరి వాతావరణంతో ‘వసుదేవసుతం’.. సాంగ్ రిలీజ్ చేసిన యంగ్ హీరో

by Chukka Sudharani |

మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘వసుదేవసుతం’.

ఊరి వాతావరణంతో ‘వసుదేవసుతం’.. సాంగ్ రిలీజ్ చేసిన యంగ్ హీరో
X

దిశ, సినిమా: మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘వసుదేవసుతం’. రెయిన్‌బో సినిమాస్ బ్యానర్‌పై బేబీ చైత్ర శ్రీ బాదర్ల, మాస్టర్ యువ్వాంశ్ కృష్ణ బాదర్ల సమర్పణలో ధనలక్ష్మి బాదర్ల నిర్మిస్తున్న ఈ చిత్రానికి వైకుంఠ్ బోను దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు, మోషన్ పోస్టర్, గ్లింప్స్, టీజర్‌ అందరినీ ఆకట్టుకోగా.. తాజాగా టైటిల్ సాంగ్‌ను హీరో ఆకాష్ జగన్నాథ్ రిలీజ్ చేశారు. ‘వసుదేవసుతం దేవం’ అంటూ సాగే ఈ లిరికల్ వీడియోలో హీరో హీరోయిన్ జంట చూడముచ్చటగా ఉండగా.. ఊరి వాతావరణం, గుడిలో చిత్రీకరించిన సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ఇక పాటను రిలీజ్ చేసిన అనంతరం ఆకాష్ జగన్నాథ్ మాట్లాడుతూ.. ‘వసుదేవసుతం’ మూవీలోని ‘వసుదేవసుతం దేవం’ అనే పాట చాలా బాగుంది. టీం అంతా వచ్చి నన్ను కలిసింది. ఈ పాటను నేను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. చైతన్య ప్రసాద్ సాహిత్యం, మణిశర్మ సంగీతం బాగుంది. మహేంద్రన్ అద్భుతమైన నటుడు. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అంటూ చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ చెప్పారు.



Next Story