Dubai Racing: దుబాయ్‌ రేసింగ్‌లో సత్తా చాటిన అజిత్‌కుమార్‌ టీం.. ఎన్నో స్థానంలో నిలిచారంటే?

by Chukka Sudharani |

కోలీవుడ్ (Kollywood) స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) అటూ సినిమాలతోనే కాకుండా కార్ రేసింగ్‌ (Car racing)లో కూడా సత్తా చాటుకుంటున్నారు.

Dubai Racing: దుబాయ్‌ రేసింగ్‌లో సత్తా చాటిన అజిత్‌కుమార్‌ టీం.. ఎన్నో స్థానంలో నిలిచారంటే?
X

దిశ, సినిమా: కోలీవుడ్ (Kollywood) స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) అటూ సినిమాలతోనే కాకుండా కార్ రేసింగ్‌ (Car racing)లో కూడా సత్తా చాటుకుంటున్నారు. ఈయన గత కొన్ని రోజులుగా దుబాయ్‌ కార్‌ రేసింగ్‌ కోసం ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొంటూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఈ రేసింగ్ ప్రాక్టీస్‌ చేస్తుండగా ఆయన కారు ట్రాక్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టడంతో భారీ ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలతో బయటపడ్డ అజిత్ కుమార్‌.. వెనుకడుగు వెయ్యకుండా ఫుల్ ఎనర్జీతో తన టీంతో కలిసి ఎండ్యూరెన్స్ రేసులో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే రీసెంట్‌గా జరిగిన రేసులో అజిత్ టీంతో పోర్చే 992 కేటగిరీలో 3వ స్థానంలో నిలిచాడు. దుబాయ్‌ 24H సిరీస్‌లో 23వ ప్లేస్‌లో నిలిచింది. ఈ సందర్భంగా అజిత్‌ కుమార్ టీంకు అభిమానులు, ఫాలోవర్లు, రేసింగ్ లవర్స్‌ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా.. ఈ స్టార్ హీరో త్వరలో ‘విదాముయార్చి’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు.

Next Story