రికార్డ్ సృష్టించిన అజిత్ కుమార్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ టీజర్.. ఎన్ని వ్యూస్ సాధించిందంటే?( ట్వీట్)

by Mallepaka Hamsa |

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith Kumar) వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

రికార్డ్ సృష్టించిన అజిత్ కుమార్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ టీజర్.. ఎన్ని వ్యూస్ సాధించిందంటే?( ట్వీట్)
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith Kumar) వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇటీవల ‘విదాముయార్చి’(Vidaamuyarchi) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన హిట్ అందుకోలేకపోయారు. విడుదలైన రోజు ఆన్‌లైన్‌లోకి హెచ్‌డీ ప్రింట్ రావడంతో బాక్సాఫీసు వద్ద నిరాశ ఎదురైంది. అయినప్పటికీ హిట్ , ఫ్లాప్ అని పట్టించుకోకుండా అజిత్ కుమార్ బ్యాక్ టు బ్యాక్ భారీ ప్రాజెక్ట్స్‌తో వస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’(Good Bad Ugly). ఈ సినిమా తెలుగులో ‘పట్టుదల’ పేరుతో తెరకెక్కుతుండగా.. దీనికి అధిక్ రవిచంద్రన్(Adhik Ravichandran) దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ పాన్ ఇండియా చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) బ్యానర్‌పై నవీన్ యర్నేని, వై. రవిశంకర్( Ravi Shankar ) నిర్మిస్తున్నారు. అయితే ఇందులో అజిత్ కుమార్ సరసన స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. అజిత్ ఏకే అనే గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో.. మూవీ మేకర్స్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ విడుదల చేస్తున్నారు.

ఇక ఇటీవల ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్‌ను దక్కించుకోవడంతో పాటు రికార్డ్ సృష్టించింది. తాజాగా, ఈ విషయాన్ని తెలుపుతూ మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా తెలుపుతూ ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. కేవలం 24 గంటల్లో 32 మిలియన్ వ్యూస్ సాధించడంతో పాటు యూట్యూబ్‌లో 1వ స్థానంలో ట్రెండింగ్‌‌లో ఉంది. అంతేకాకుండా కోలీవుడ్‌లో అత్యధిక వ్యూస్ సాధించి రికార్డ్ సృష్టించింది. ప్రస్తుతం మూవీ మేకర్స్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన అజిత్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Next Story