- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అజిత్ కుమార్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ కలెక్షన్స్.. ఎన్ని కోట్లు రాబట్టిందంటే?
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith Kumar) బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నప్పటికీ ఘన విజయం సాధించలేకపోతున్నారు.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith Kumar) బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నప్పటికీ ఘన విజయం సాధించలేకపోతున్నారు. ఇటీవల ‘విదాముయార్చి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించలేకపోయారు. అయినప్పటికీ హిట్స్, ఫ్లాప్స్ పట్టించుకోకుండా వరుస మూవీస్ చేస్తున్నారు. ఆయన నటించిన లేటెస్ట్ సినిమా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’(Good Bad Ugly). ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో త్రిష, అర్జున్ దాస్, ప్రియా ప్రకాష్ వారియర్(Priya Prakash Varrier) కీలక పాత్రలో కనిపించారు. అయితే ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 10న థియేటర్స్‌లోకి వచ్చింది. ప్రేక్షకులను ఆకట్టుకుంటూ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, అజిత్ కుమార్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మొదటి రోజు కలెక్షన్స్‌ను మూవీ మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా మొదటి రోజే రూ.30.9 కోట్ల గ్రాస్ సాధించిన అజిత్ కుమార్ కెరీర్‌లోనే బెస్ట్‌గా నిలిచినట్లు తెలుస్తోంది. ఆయన కెరీర్‌లోనే మొదటి రోజు అత్యధికంగా రాబట్టినట్లు మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.






