Ajith Kumar: బీభత్సం సృష్టించిన అజిత్ కుమార్ ఫ్యాన్స్.. ‘పట్టుదల’ థియేటర్స్‌లో అలా చేయడంతో నెటిజన్లు ఫైర్!

by Hamsa |
Ajith Kumar: బీభత్సం సృష్టించిన అజిత్ కుమార్ ఫ్యాన్స్.. ‘పట్టుదల’ థియేటర్స్‌లో అలా చేయడంతో నెటిజన్లు ఫైర్!
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith Kumar) వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు పోటీ నిస్తున్నారు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘విదాముయార్చి’(Vidaamuyarchi). మగిత్ తిరుమనేని(Magith Thirumaneni) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో త్రిష(Trisha) హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ తెలుగులో పట్టుదల పేరుతో వచ్చింది. ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఈ రోజు (ఫిబ్రవరి 6న)ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదలై పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది.

అయితే అజిత్ అభిమానులు థియేటర్స్‌లో బాణాసంచా కాలుస్తూ అభిమాన హీరో సినిమాను సెలబ్రేట్ చేసుకుని బీభత్సం సృష్టించినట్లు సమాచారం. ఇంకా కొంతమంది థియేటర్ లోపల పోలీసులతోనే గొడవపడుతూ కనిపించారు. దురుసుగా ప్రవర్తించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన వారంతా మండిపడుతున్నారు. బాణాసంచా కాల్చిన సమయంలో అగ్ని ప్రమాదం జరిగి ఉంటే మీ ప్రాణాలు పోయేవని హెచ్చరిస్తున్నారు. ఇక నుంచి అయినా అలాంటివి చేయకుండా ఉండటం మంచిదని సూచిస్తున్నారు.

అయితే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. గత కొద్ది రోజుల నుంచి ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఏదైనా స్టార్ హీరో సినిమా విడుదలవుతుందంటే చాలు అభిమానులు నానా హంగామా చేస్తున్నారు. పాలాభిషేకం, రక్తంతో బొట్టు పెట్టడం వంటివి చేస్తూ జనాలను భయాందోళనకు గురి చేస్తున్నారు. ఇక ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ విడుదల రోజు కూడా కొందరు వైన్‌తో అభిషేకం చేయగా.. మరికొందరు థియేటర్స్ ముందు జంతు బలిచ్చారు. ఇక ఈ ఘటన వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే.

Advertisement
Next Story