AK64: నిర్మాణ సంస్థతో విభేదాలు.. తన సినిమాను తానే నర్మించుకుంటున్న స్టార్ హీరో!

by Chukka Sudharani |

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తన ‘AK64’ చిత్రాన్ని తానే నిర్మించుకోబోతున్నట్లు ఫిలిమ్ వర్గాల నుంచి సమాచారం.

AK64: నిర్మాణ సంస్థతో విభేదాలు.. తన సినిమాను తానే నర్మించుకుంటున్న స్టార్ హీరో!
X

దిశ, సినిమా: రేసింగ్‌తో బిజీగా ఉన్నప్పటికీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు సైతం అనౌన్స్ చేస్తున్న కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్.. ప్రస్తుతం తన తదుపరి చిత్రం కోసం సమయం కేటాయించనున్నాడు. ఈ మేరకు ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన అధిక్ రవిచంద్రన్‌తో మరోసారి చేతులు కలిపాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ‘AK64’ కి సంబంధించి పనులను వేగవంతం చేశారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ నిర్మాణానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అజిత్ రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతలకు, హీరోకు మధ్య కొన్ని విభేదాలు వచ్చినట్లు టాక్. దీంతో ఈ సినిమాను అజిత్ తానే స్వయంగా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇక మరో నిర్మాణ సంస్థ కేవలం ఫండింగ్ సపోర్ట్ మాత్రమే అందిస్తుందని తెలుస్తుండగా.. అజిత్ తన సొంత బ్యానర్‌పైనే AK64 ను పట్టాలెక్కించే ప్లాన్ ఉన్నట్లు టాక్. అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే మే 1వ తేదీన ఈ సినిమా నుంచి ఓ మంచి అప్డేట్ రానున్నట్లు సమాచారం. అలాగే కోలీవుడ్‌లో జరగబోయే ఎలక్షన్స్ అనంతరం షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తుండగా.. మరిన్ని అప్డేట్స్ త్వరలో రానున్నాయి.

Next Story