- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నన్ను అవమానించారు... హీరో అజిత్ ఎమోషనల్ పోస్ట్ !
సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నప్పటికీ... కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతూ ఉంటారు. అలాంటి వారిలో హీరో అజిత్

దిశ, వెబ్ డెస్క్ : సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నప్పటికీ... కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతూ ఉంటారు. అలాంటి వారిలో హీరో అజిత్ కుమార్ ఒకరు. అతి తక్కువ కాలంలోనే.. పాపులర్ అయిన హీరోలలో ఈయన ఒకరు. తమిళ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా ఇతనికి మంచి ఫాలోయింగ్ ఉంది. అజిత్ కుమార్ సినిమా వచ్చిందంటే చాలు... చాలామంది ఎగబడి చూస్తారు.
అయితే అలాంటి అజిత్ కుమార్ కీలక పోస్ట్ పెట్టాడు. ఇండస్ట్రీలో అడుగుపెట్టి 33 సంవత్సరాలు అయిన నేపథ్యంలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు అజిత్. సినిమా అనే కష్టమైన ఇండస్ట్రీలో నేను 33 సంవత్సరాలుగా కొనసాగుతున్నాను అని వెల్లడించాడు. గడిచిన ప్రతి సంవత్సరం నాకు ఒక మైలురాయి అంటూ వ్యాఖ్యానించాడు.
ఈ 33 సంవత్సరాల లో... అభిమానులు... తనకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారని కూడా గుర్తు చేశాడు. నేను సినిమా ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఇంటి నుంచి రాలేదు... సొంతంగా తాను ఎదిగినట్లు స్పష్టం చేశారు. తన జీవితంలో ఎన్నో మానసిక ఒత్తిడిలు, ఎదురుదెబ్బలు, ఫెయిల్యూర్స్ చూశాను అని ఎమోషనల్ అయ్యారు. కానీ ఎక్కడ కూడా ఆగిపోలేదని... అన్ని ఎదుర్కొని ముందుకు వెళ్లినట్లు చెప్పుకొచ్చాడు. కొంతమంది అవమానించినా కూడా.. ఎదుర్కొన్నానని.. వెల్లడించాడు అజిత్ కుమార్.






