- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అజయ్ షాకింగ్ కామెంట్స్.. ‘ఒంగోలు గిత్త’ టైంలో సత్య పరిస్థితి అలా ఉండేది
అజయ్ మాట్లాడుతూ… ‘ఒంగోలు గిత్త’ సమయంలో సత్య బయట తిరుగుతుండగా పిలిచి, ఆయనతో మాట్లాడానని చెప్పుకొచ్చాడు.

దిశ, వెబ్ డెస్క్: కమెడియన్ సత్య సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఎన్నో సంవత్సరాలు గడిచాయి. ప్రస్తుతం ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ కమెడియన్లలో ఒకరిగా కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఇంతకాలం కమెడియన్‌గా ప్రేక్షకులను అలరించిన సత్య, తాజాగా ‘జెట్లీ’ సినిమాలో ప్రధాన పాత్రలో నటించి మరో మెట్టు ఎక్కారు. ఈ సినిమా మే 1న భారీ స్థాయిలో థియేటర్లలో విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో చిత్ర బృందం సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో నటుడు అజయ్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ సత్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “సత్య చాలా మంచి నటుడు. నాకు చాలా ఏళ్లుగా తెలుసు. కొన్ని సంవత్సరాల క్రితం ‘ఒంగోలు గిత్త’ సినిమా షూటింగ్ సమయంలో ఆయన అక్కడ బయట తిరుగుతుండగా చూశాను. వెంటనే పిలిచి నా క్యారవాన్‌లోకి తీసుకెళ్లి చాలా సేపు మాట్లాడాను. ఆ సమయంలో నాకు ఎంతో ఆనందంగా అనిపించింది” అని తెలిపారు. అలాగే సత్య ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 20 సంవత్సరాలు అవుతున్నాయని, ‘కలవరి కింగ్’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారని గుర్తుచేశారు. ఇలా ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ ముందుకు సాగి ఇప్పుడు హీరో స్థాయికి చేరుకోవడం నిజంగా గొప్ప విషయమని అజయ్ ప్రశంసించారు.






