- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెగా హీరోపై అజయ్ ఘోష్ ఇంట్రెస్టింగ్ కామెంట్..
టాలీవుడ్‌లో తనదైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్న యాక్టర్స్‌లో అజయ్ ఘోష్(Ajay Ghosh) ఒకరు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో తనదైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్న యాక్టర్స్‌లో అజయ్ ఘోష్(Ajay Ghosh) ఒకరు. ఆయన తన విలక్షణ నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. విలన్ క్యారెక్టర్‌లో తనకంటూ ఓ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అలా అతను ‘రంగస్థలం’(Rangasthalam), ‘పుష్ప’(Pushpa) సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించి అలరించారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అజయ్ ఘోష్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. ‘చరణ్ చాలా మంచి వ్యక్తి .. చిన్నా పెద్దా అని తేడా లేదు అందరిని పలకరిస్తుంటారు. పెద్ద హీరో, చిరంజీవి కొడుకు అనే ఫీలింగ్స్ లాంటివి ఏమీ ఉండవు.. చాలా ఒదిగి ఉంటాడు. ఒక ఫైట్ సీన్‌లో నా కాలుకు దెబ్బ తగిలింది.
చరణ్ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైందండీ అంటూ అడిగి నా కాలికి ప్యాడ్స్ పెట్టి వెంటనే అపోలోకి ఫోన్ చేసి నన్ను పంపించారు. మొత్తం స్కాన్ చేశారు. నెలన్నర బెడ్ రెస్ట్ ఇచ్చారు. అయినా నా గురించి రోజు అడిగి తెలుసుకునేవారు’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అజయ్ ఘోష్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.






