Ajay Devgan: అజయ్ దేవగణ్ రైడ్-2 టీజర్.. ఫ్యాన్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్ పక్కా!

by Chukka Sudharani |   (  Updated:2025-08-26 17:02:49  IST  )

బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ (Ajay Devgan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రైడ్-2’

Ajay Devgan: అజయ్ దేవగణ్ రైడ్-2 టీజర్.. ఫ్యాన్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్ పక్కా!
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ (Ajay Devgan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రైడ్-2’ (Raid-2). క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రైడ్’ (Raid) మూవీకి సీక్వెల్‌గా రాబోతుంది. దీనికి రాజ్ కుమార్ గుప్తా (Raj Kumar Gupta) దర్శకత్వం వహిస్తుండగా.. రితేష్ దేశ్‌ముఖ్, వాణి కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పనోరమా స్టూడియోస్ బ్యానర్‌పై భూషన్ కుమార్, కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్, క్రిషన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ మహాశివరాత్రి స్పెషల్‌గా ఫిబ్రవరి 21 థియేటర్లలో విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల చేత పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు సమ్మర్ కానుకగా మే 1న రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఇక రిలీజ్ సమయం దగ్గరపడటంతో ప్రమోషన్స్‌(Promotion)లో జోరు పెంచిన చిత్ర బృందం.. తాజాగా ‘రైడ్-2’ నుండి టీజర్ రిలీజ్ చేశారు.

టీజర్‌(Teaser)ను గమనించినట్లయితే.. ఇన్‌కమ్ టాక్స్‌లో సీనియర్ అధికారి అయిన అమయ్ పట్నాయక్ (అజయ్ దేవగణ్) కనిపిస్తాడు. అయితే.. రాజకీయ నాయకులతో పాటు బిజినెస్ మ్యాన్‌ల ఇంటిపై రైడ్‌లు చేస్తూ వాళ్లకు చెమటలు పట్టిస్తుంటాడు. ఇందులో భాగంగా ఓ బడా రాజకీయ నేత ఇంటిపై ఐటీ రైడ్ (IT Ride) చేయాలని ప్రభుత్వం నుంచి అమయ్‌కు ఆదేశాలు వస్తాయి. ఆ తర్వాత ఏం జరుగుతుంది.. వాళ్లతో అమయ్‌కు వచ్చే సమస్యలు అనే దాని చుట్టూ ఈ కథ తిరుగుతుందని అనిపిస్తుంది. మొత్తంగా ఫుల్ అండ్ యాక్షన్‌గా అజయ్ దేవగణ్ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చెయ్యడానికి వచ్చేస్తున్నట్లు టీజర్ చూస్తే అర్థం అవుతోంది.

Click For Video ....

Next Story